Share News

స్టీల్‌ప్లాంటుకు మరో గ్యాస్‌ ట్యాంకర్‌

ABN , Publish Date - Mar 19 , 2026 | 01:44 AM

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు బుధవారం మరో ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ వచ్చింది. యుద్ధం ప్రారంభమైన తరువాత స్టీల్‌ప్లాంటుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేసింది. నిల్వలు ఇంకో ఐదు రోజులకు మించి లేవని, తప్పనిసరిగా ఎల్‌పీజీ సరఫరా చేయాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగం స్పందించి మంగళవారం 18 టన్నుల ఎల్‌పీజీ ట్యాంకర్‌ను పంపించారు.

స్టీల్‌ప్లాంటుకు మరో గ్యాస్‌ ట్యాంకర్‌

విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు బుధవారం మరో ఎల్‌పీజీ గ్యాస్‌ ట్యాంకర్‌ వచ్చింది. యుద్ధం ప్రారంభమైన తరువాత స్టీల్‌ప్లాంటుకు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఎల్‌పీజీ సరఫరాను నిలిపివేసింది. నిల్వలు ఇంకో ఐదు రోజులకు మించి లేవని, తప్పనిసరిగా ఎల్‌పీజీ సరఫరా చేయాల్సి ఉందని ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించడంతో అధికార యంత్రాంగం స్పందించి మంగళవారం 18 టన్నుల ఎల్‌పీజీ ట్యాంకర్‌ను పంపించారు. బుధవారం కూడా మరో 18 టన్నులు వచ్చింది. ప్లాంటుకు రోజుకు 13 టన్నుల గ్యాస్‌ అవసరం కాగా ఇప్పుడున్న ఎల్‌పీజీ వారం రోజులకు సరిపోతుంది. ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా ఎల్‌పీజీ సరఫరా చేస్తే ప్లాంటు నష్టాల్లోకి వెళ్లకుండా నిలదొక్కుకుంటుందని, దీనికి కేంద్రం సహకరించాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి.

Updated Date - Mar 19 , 2026 | 01:44 AM