Share News

ఏటా జాబ్‌ క్యాలెండర్‌

ABN , Publish Date - Mar 20 , 2026 | 01:11 AM

పాదయాత్రలో యువ నేత నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిందని ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు.

ఏటా జాబ్‌ క్యాలెండర్‌

యువగళంలో యువ నేత నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు విడుదల

పరీక్షలకు యువత సిద్ధం కావాలి

ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు

విశాఖపట్నం, మార్చి 19 (ఆంధ్రజ్యోతి):

పాదయాత్రలో యువ నేత నారా లోకేశ్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిందని ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో నిరుద్యోగుల బాధలు వర్ణనాతీతమని, వారి సమస్యలను పాదయాత్రలో లోకేశ్‌ తెలుసుకున్నారని, క్రమం తప్పకుండా ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని భరోసా ఇచ్చారన్నారు. ఆ మేరకు ఉగాది రోజున 10,060 ఉద్యోగాలతో జాబ్‌ క్యాలెండర్‌ విడులైందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మరో మూడు జాబ్‌ క్యాలెండర్లు విడుదల చేస్తోందన్నారు. ఈ ఏడాది తొలుత విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలవుతుందన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసినందుకు నిరుద్యోగ యువత తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖల మంత్రి నారా లోకేశ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. క్యాలెండర్‌లో పేర్కొన్న షెడ్యూల్‌ మేరకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్న నేపథ్యంలో నిరుద్యోగులు ఇప్పటి నుంచే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో విశాఖ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చోడేవెంకట పట్టాభి, లొడగల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 01:11 AM