పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:28 AM
మునిసిపాలిటీలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కమిషనర్ జంపా సురేంద్ర సిబ్బందితో కలిసి శుక్రవారం ప్రకటించారు. 40 వార్డులకు పురపాలక ఎన్నికల నిర్వహించడానికి 76 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఫారం-1లో ప్రకటించారు.
నర్సీపట్నం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను కమిషనర్ జంపా సురేంద్ర సిబ్బందితో కలిసి శుక్రవారం ప్రకటించారు. 40 వార్డులకు పురపాలక ఎన్నికల నిర్వహించడానికి 76 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను ఫారం-1లో ప్రకటించారు. మునిసిపల్ కార్యాలయంతో పాటు తహశీల్దార్, సబ్ కలెక్టర్, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో ప్రకటించినట్టు కమిషనర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాపై ఏమైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే శనివారం సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గత మునిసిపల్ ఎన్నికలు 28 వార్డులకు 56 పోలింగ్ కేంద్రాల్లో జరిగాయి. తాజాగా చేపట్టిన వార్డుల పునర్విభజనలో 28 వార్డులు 40 కాగా, ఇప్పటి వరకు ఉన్న 56 పోలింగ్ కేంద్రాలు 76కి పెరిగాయి.