అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు విడుదల నేడు
ABN , Publish Date - Jun 19 , 2026 | 10:39 PM
వసాయాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున శనివారం ప్రభుత్వం జమ చేయనుంది.
రూ.7 వేలు చొప్పున రైతుల ఖాతాల్లో జమ
జిల్లాలో 1,03,864 మంది రైతులకు లబ్ధి
పాడేరు, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7 వేలు చొప్పున శనివారం ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకం కింద జిల్లాలో 1,03,864 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 11 మండలాల పరిధిలో అన్నదాత సుఖీభవలో భాగంగా 1,03,864 మంది రైతులకు రూ.5 వేలు చొప్పున రూ.51 కోట్ల 93 లక్షలు, పీఎం కిసాన్ పథకంలో 1,06,233 మంది రైతులకు రూ.2 వేలు చొప్పున రూ. 21.26 కోట్లను ప్రభుత్వం విడుదల వేయనుంది.