ప్రజా సమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ చొరవ భేష్
ABN , Publish Date - Mar 13 , 2026 | 12:54 AM
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ విశేష కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. దిబ్బపాలెం సెజ్ పునరావాస కాలనీలో నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుతో నిర్వాసితులైన 22 గ్రామాల ప్రజలకు దిబ్బపాలెంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్
దిబ్బపాలెం సెజ్ పునరావాస కాలనీలో సమస్యలను పరిష్కరిస్తానని హామీ
సెజ్‌లో ఆటిజం స్కూల్, ట్రైనింగ్ సెంటర్, స్పోర్ట్సు కాంప్లెక్సు
అచ్యుతాపురం, అచ్యుతాపురం రూరల్, మార్చి 12, (ఆంధ్రజ్యోతి):
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ విశేష కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ అన్నారు. దిబ్బపాలెం సెజ్ పునరావాస కాలనీలో నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండాగా...’ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుతో నిర్వాసితులైన 22 గ్రామాల ప్రజలకు దిబ్బపాలెంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఇలాంటి వేదికలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహిస్తున్న ఇటువంటి మంచి కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం సంతోషదాయకమన్నారు. పునరావాస కాలనీలో తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, వాటి పరిష్కారానికి చేస్తున్న కృషి గురించి వివరించారు.
సమస్యలను అధికారులు పట్టించుకోలేదు
పునరావాస కాలనీ ఏర్పాటు చేసి చాలా సంవత్సరాలు అయినప్పటికీ సంబంధిత అధికారులు ఇక్కడ పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ అన్నారు. ఆర్‌అండ్‌ఆర్ సమస్యల సాధనకోసం వారానికి ఒకసారి అధికారులతో సమావేశమవుతున్నట్టు తెలిపారు. కాలనీలో రహదారులు, డ్రైనేజీ కాలువలు, తాగునీటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కొళాయి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. సెజ్ పునరావాస కాలనీలో నుంచి భారీ వాహనాల రాకపోకలతో ఇబ్బంది పడుతున్నట్టు స్థానికులు చెప్పారని, ఈ సమస్యను నివారించడానికి మార్టూరు రోడ్డు, ఆర్.నర్సాపురం నుంచి కంపెనీలకు వాహనాలు వెళ్లేలా త్వరలో రెండు రహదారులను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. ఈపీడీసీఎల్ అధికారులతో మాట్లాడి విద్యుత్తు లోవోలేజీ సమస్యను పరిష్కారిస్తానని చెప్పారు. పాఠశాలలను సెజ్‌లోని కంపెనీలకు దత్తత ఇచ్చి అభివృద్ధి చేయిస్తానని ఎమ్మెల్యే విజయ్‌కుమార్ తెలిపారు.
ఆటిజం (మతిమరుపు) సమస్యతో బాధపడుతున్న వారి కోసం సెజ్‌లో ఆటిజం స్కూల్, ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎనిమిదిన్నర ఎకరాల్లో స్పోర్ట్సు కాంప్లెక్సును ఏర్పాటు చేసి, స్పోర్ట్సు అఽథారిటీ ఆఫ్ ఇండియా తరపున కోచ్‌లను అందుబాటులో వుంచుతామని చెప్పారు. సెజ్ పరిశ్రమల సీఎస్‌ఆర్ నిధులతో చెరువులు, ఆలయాలు, మసీదులు, చర్చిలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు.