అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయం
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:07 AM
అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయంగా ఉంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఘాట్‌రోడ్డులో గోతులను పూడ్చారు. ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే తిరిగి గోతులు ఏర్పడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పాణిరంగిని- బెంజిపూర్ మార్గంలో ప్రస్తుతం అడుగడుగునా గోతులు కనిపిస్తున్నాయి.
- అనంతగిరి- అరకు మార్గంలో రాకపోకలకు ఇబ్బందులు
అరకులోయ, జూలై 5 (ఆంరఽదజ్యోతి): అనంతగిరి- అరకులోయ ఘాట్‌రోడ్డు గోతులమయంగా ఉంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఘాట్‌రోడ్డులో గోతులను పూడ్చారు. ఈ పనులు చేపట్టిన కొద్ది నెలల్లోనే తిరిగి గోతులు ఏర్పడ్డాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పాణిరంగిని- బెంజిపూర్ మార్గంలో ప్రస్తుతం అడుగడుగునా గోతులు కనిపిస్తున్నాయి. అలాగే సుంకరమెట్ట నుంచి బీసుపురం కాఫీ తోటల వరకు రోడ్డు గోతులమయంగా ఉంది. అనంతగిరి- అరకు ఘాట్‌రోడ్డు నేషనల్ హైవే అథారిటీ పరిధిలో ఉండడంతో ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్ అధికారులు ఈ రహదారి నిర్వహణ పనులను వదిలేశారు. అయితే నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేయాలని వాహనచోదకులు కోరుతున్నారు.