రక్షణ లేని వంతెన
ABN , Publish Date - Mar 04 , 2026 | 01:01 AM
పట్టణంలో పాత జాతీయ రహదారిపై శేషుగెడ్డ వంతెనకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం విషయంలో అధికారులు తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాల్లో వేలాది మంది ప్రయాణిస్తుంటారు.
శేషుగెడ్డపై ప్రమాదభరింతగా మారిన ప్రయాణం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఎలమంచిలి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో పాత జాతీయ రహదారిపై శేషుగెడ్డ వంతెనకు ఇరువైపులా రక్షణ గోడల నిర్మాణం విషయంలో అధికారులు తీవ్రనిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాల్లో వేలాది మంది ప్రయాణిస్తుంటారు. శేషుగెడ్డ వద్ద రహదారి ఒకింత ఇరుకుగా వుంది. రెండు బస్సులు ఇక్కడ ఎదురైతే తప్పుకోవడం కష్టంగా వుంటుంది. ఒక బస్సు, ఎదురుగా కారు వచ్చినా ఇదే పరిస్థితి. క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. సుమారు 40 ఏళ్ల క్రితం తక్కువ ఎత్తులో ఈ వంతెన నిర్మించడంతో వర్షాకాలంలో శేషుగెడ్డ ఉగ్రరూపం దాల్చి, జాతీయ రహదారిమీదుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ఇరువైపులా రక్షణ గోడ లేకపోవడంతో రహదారి అంచులను అంచనా వేయలేక వాహనదారులు గెడ్డలో పడిపోతున్నారు. కొన్నేళ్ల నుంచి ఈ పరిస్థితి వున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.