కొనసాగుతున్న చమురు కొరత
ABN , Publish Date - Mar 28 , 2026 | 12:42 AM
పాడేరులో చమురు కొరత వేధిస్తోంది. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధ ప్రభావం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై తీవ్రంగా చూపుతున్న విషయం తెలిసిందే. దీంతో బంకుల్లో ఎప్పుడు చమురు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పాడేరులో ఏడు బంకులు ఉండగా, రెండు బంకుల్లో మాత్రమే డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయి.
- డీజిల్, పెట్రోల్ వినియోగదారులకు తప్పని అవస్థలు
పాడేరు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): పాడేరులో చమురు కొరత వేధిస్తోంది. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధ ప్రభావం జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై తీవ్రంగా చూపుతున్న విషయం తెలిసిందే. దీంతో బంకుల్లో ఎప్పుడు చమురు ఉంటుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పాడేరులో ఏడు బంకులు ఉండగా, రెండు బంకుల్లో మాత్రమే డీజిల్, పెట్రోల్ నిల్వలున్నాయి. మిగిలిన బంకుల్లో అరకొరగానే ఉంటున్నాయి. పాడేరులో శుక్రవారం పాత బంకు, తలారిసింగిలో ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే చింతలవీధిలో ఐటీడీఏ నిర్వహణలో ఉన్న హెచ్‌పీ బంకులో డీజిల్ మాత్రమే ఉండగా, జి.మాడుగుల రోడ్డులో ఉన్న భారత్ పెట్రోలియం బంకులో డీజిల్ లేకపోగా పెట్రోల్ మాత్రమే ఉంది. విశాఖపట్నం వెళ్లే మెయిన్ రోడ్డులోని ఉన్న టి.చిట్టినాయుడు, బొర్రా విజయరాణి ఫిల్లింగ్ స్టేషన్లలో మాత్రమే డీజిల్, పెట్రోల్ రెండూ ఉన్నాయి.
జీకేవీధిలో...
గూడెంకొత్తవీధి : మండల కేంద్రంలో జీసీసీ నిర్వహించే హెచ్‌పీ పెట్రోల్ బంకు పెట్రోల్, డీజిల్ నిల్వలు లేక మూతపడింది. దీంతో 15 పంచాయతీల ప్రజలకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు.