ఉత్సాహంగా సీడ్‌బాల్స్ వెదజల్లే కార్యక్రమం
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:33 AM
జీకే వీధి మండలం సీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో ని ధారకొండ, దుప్పులవాడ బీట్‌లో గురువారం 10 వేల సీడ్‌బాల్స్ వెదజల్లారు. ధారకొండ సెక్షన్ ఆఫీసర్ సతీశ్ ఆధ్వర్యంలో దుప్పిలివాడ పంచాయతీ దబ్బకోట గ్రామంలో నాలుగు వేల సీడ్‌బాల్స్ వెదజల్లారు.
- ధారకొండ, దుప్పులవాడ బీట్ పరిధిలో 10 వేల సీడ్‌బాల్స్ వెదజల్లిన అటవీశాఖ సిబ్బంది
సీలేరు, జూలై 2 (ఆంరఽధ జ్యోతి): జీకే వీధి మండలం సీలేరు అటవీశాఖ రేంజ్ పరిధిలో ని ధారకొండ, దుప్పులవాడ బీట్‌లో గురువారం 10 వేల సీడ్‌బాల్స్ వెదజల్లారు. ధారకొండ సెక్షన్ ఆఫీసర్ సతీశ్ ఆధ్వర్యంలో దుప్పిలివాడ పంచాయతీ దబ్బకోట గ్రామంలో నాలుగు వేల సీడ్‌బాల్స్ వెదజల్లారు. అలాగే గొందిపొలంలో రెండు వేలు, అమ్మవారి ధారకొండ బీట్ పరిధిలో గల ఏనుగుబైలు ప్రాంతంలో నాలుగు వేల సీడ్ బాల్స్ వెదజల్లారు. ఈ కార్యక్రమంలో గిరిజన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకోసం సీడ్‌బాల్స్‌ను వెదజల్లుతున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం, సీడ్‌బాల్స్ తయారు చేసి జల్లడం చేయాలని సెక్షన్ ఆఫీసర్ సతీశ్ కోరారు. అడవుల్ని నాశనం చేయడం వలన అనేక అనర్ధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దుప్పిలివాడ ఏబీవో ప్రకాశ్, బీట్ ఆఫీసర్ లోవరాజు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.