Share News

అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:40 AM

మండలంలోని బంగారమ్మపేట నుంచి మునసల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో పలు చోట్ల భారీ గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు.

అధ్వాన దారిలో అవస్థల ప్రయాణం
పరదేశిపాకలు సమీపంలో రోడ్డుపై ఏర్పడిన గోతుల్లో నిలిచిన వర్షపు నీరు (ఫైల్‌)

గోతులమయంగా బంగారమ్మపేట- మునసల రోడ్డు

29 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు

కొయ్యూరు, ఆగస్ట్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బంగారమ్మపేట నుంచి మునసల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారిలో పలు చోట్ల భారీ గోతులు ఉండడంతో వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. 17 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రోడ్డుకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

సుమారు 29 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించే ఈ రహదారిని 2009లో నిర్మించారు. అయితే అప్పటి నుంచి ఈ రోడ్డుకు కనీస మరమ్మతులు చేపట్టలేదు. దీంతో బంగారమ్మపేట నుంచి పరదేశిపాకలు గ్రామం వరకు భారీ గోతులు ఏర్పడ్డాయి. వర్షాలు కురిసినప్పుడు ఆ గోతుల్లో నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అలాగే అంతాడ- రాజుపేట మధ్య రహదారి కోతకు గురికావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రజాప్రతి నిధులు, అధికారులు స్పందించి ఈ రహదారి పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని 29 గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:40 AM