Share News

గ్లాస్‌ బ్రిడ్జిపై ఆమ్రపాలి

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:07 AM

ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి తన కుటుంబ సభ్యులతో కలసి ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రుషికొండ బీచ్‌ను సందర్శించిన ఆమె శుక్రవారం రాత్రి లంబసింగి వెళ్లారు.

గ్లాస్‌ బ్రిడ్జిపై  ఆమ్రపాలి
కుటుంబ సభ్యులతో కలిసి గ్లాస్‌బ్రిడ్జిపై ఆమ్రపాలి

విశాఖపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి తన కుటుంబ సభ్యులతో కలసి ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. రుషికొండ బీచ్‌ను సందర్శించిన ఆమె శుక్రవారం రాత్రి లంబసింగి వెళ్లారు. అక్కడ తెల్లవారు జామున చెరువులవేనం వెళ్లి మంచు మేఘాలను వీక్షించారు. ఆ తరువాత పరిసర ప్రాంతాల్లోని పర్యాటక కేంద్రాలకు వెళ్లి శనివారం మధ్యాహ్నం విశాఖపట్నం వచ్చారు. కైలాసగిరికి వెళ్లి గ్లాస్‌ బ్రిడ్జిని సందర్శించారు. అక్కడ ఫొటోలు దిగారు. బ్రిడ్జిపై నుంచి విశాఖపట్నం ప్రకృతి సోయగాలు చాలా బాగున్నాయని, సముద్రం పైకి వెళ్లినట్టుగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 01:08 AM