Share News

లంబసింగిలో ఆమ్రపాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 10:40 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో ఏపీ పర్యాటక అభివద్ధి సంస్థ(ఏపీటీడీసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి కటా శుక్రవారం పర్యటించారు.

లంబసింగిలో ఆమ్రపాలి
ఏపీటీడీసీ వీసీ, ఎండీ ఆమ్రపాలి

కుటుంబ సభ్యులతో పర్యాటక ప్రాంతాల సందర్శన

హరిత రిసార్ట్స్‌లో ఏపీటీడీసీ వైస్‌ చైర్మన్‌, ఎండీ బస

చింతపల్లి, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగిలో ఏపీ పర్యాటక అభివద్ధి సంస్థ(ఏపీటీడీసీ) వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆమ్రపాలి కటా శుక్రవారం పర్యటించారు. సాయంత్రం లంబసింగి హరిత రిసార్ట్స్‌కి ఆమె కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. రాత్రి ఆమె హరిత రిసార్ట్స్‌లో బస చేశారు. శనివారం ఉదయం చెరువులవేనం వ్యూపాయింట్‌, తాజంగి జలాశయం, లంబసింగి స్ట్రాబెర్రీ తోటలను ఆమె సందర్శించారు. హరిత రిసార్ట్స్‌ ఏపీటీడీసీ సిబ్బందితో ఆమె మాట్లాడుతూ లంబసింగికి ఏడాది పొడవున పర్యాటకులు సందర్శించేందుకు అనువుగా పర్యాటక శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందన్నారు. పర్యాటకులను ఆకర్షించేందుకు అదనపు సదుపాయాలు కల్పిస్తామన్నారు. హరిత రిసార్ట్స్‌లో అదనపు గదులు త్వరలో నిర్మిస్తామన్నారు. లంబసింగి ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని, ప్రతి ఒకరూ సందర్శించాల్సిన ప్రాంతమన్నారు. ఆమెతో పాటు స్థానిక ఏపీటీడీసీ పర్యాటక శాఖ మేనేజర్‌ సూరెడ్డి అప్పలనాయుడు ఉన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 10:40 PM