Share News

అబ్బురపరిచిన విన్యాసాలు

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:14 AM

సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది.

అబ్బురపరిచిన విన్యాసాలు

ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా ఇండియన్‌ నేవీ రిహార్సల్స్‌

ఆసక్తిగా తిలకించిన నగర వాసులు

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి):

సాగరతీరం ఆదివారం సాయంత్రం రణరంగాన్ని తల పించింది. యుద్ధ విమానాల హోరు, బాంబుల మోతతో హోరెత్తించిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రయ్యమంటూ దూసుకెళ్లిన హెలికాప్టర్లు, దట్టమైన పొగ మధ్యలో నుంచి జెట్‌స్పీడ్‌తో దూసుకెళ్లిన యుద్ధ ట్యాంకర్లతో ఆర్కే బీచ్‌ యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

అప్పటివరకు బీచ్‌ రోడ్డులో వివిధ కార్యకలాపాల్లో మునిగితేలిన సందర్శకులు ఒక్కసారిగా బాంబులమోత, యుద్ధ విమానాలతో హోరుతో ఆందోళనకు గురయ్యారు. ఆ తరువాత విషయం తెలుసుకుని కుదుటపడ్డారు. అంతర్జాతీయ ఫ్లీట్‌ రివ్యూలో భాగంగా ఆదివారం సాయంత్రం 5.30 గంటల నుంచి ఆరు గంటల వరకు ఆర్కే బీచ్‌ తీరంలో ఇండియన్‌ నేవీ ఆధ్వర్యంలో రిహార్సల్స్‌ జరిగాయి. ఇండియన్‌ నేవీకి చెందిన యుద్ధ విమానాలు, ట్యాంకులు, హెలీకాప్టర్లు, యుద్ధ నౌకలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. యుద్ధ సమయాల్లో శత్రుమూకలను ఎలా ఎదుర్కొంటామో నగర ప్రజల కళ్లకు కట్టినట్టు సిబ్బంది విన్యాసాలు చేసి చూపించారు. ప్రధానంగా నేవీ విమా నాలు శత్రు దేశాల స్థావరాలపై బాంబులు జార విడిచే తీరు,హెలికాప్టర్ల సాయంతో సంద్రంలో చిక్కుకున్న కమెండోలను రక్షించే విధానం, యుద్ధ ట్యాంకర్లతో శత్రుస్థావ రాలపై విరుచుకుపడే వైనాన్ని చూపించారు. దేశ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయిలో ఇనుడింపజేసేలా నేవీ సిబ్బంది చేసిన క్లిష్టతరమైన విన్యాసాలు సందర్శ కులను సంభ్రమాశ్చర్యానికి గురిచేశాయి. ప్రధానంగా జాతీయ పతాకాలతో నేవీ హెలికాప్టర్ల విన్యాసాలు అదరహో అనిపించాయి. యుద్ధట్యాంకులతో వచ్చిన నేవీ సిబ్బంది అధికా రులకు అభివాదం చేసి, నేవీ శక్తి సామర్థ్యాలను ప్రజలకు ప్రస్ఫుటింపజేశాయి.


ఐఎఫ్‌ఆర్‌కు జోరుగా ఏర్పాట్లు

ప్రారంభమైన మిలాన్‌ విలేజ్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి) :

తూర్పు నౌకాదళం విశాఖలో నిర్వహించే ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌)కు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 19న ఆర్కే బీచ్‌లో ఐఎఫ్‌ఆర్‌లో భాగంగా పెద్దఎత్తున విన్యాసాలను నిర్వహించనున్నారు. వీటిని తిలకించేందుకు నగరవాసులతో పాటు ప్రము ఖులు హాజరుకానున్నారు దీంతో అతిథులు, అధికారులు, నగరవాసులు వీక్షించేందుకు అనుగుణంగా గ్యాలరీలు నిర్మిస్తున్నారు. మిగిలిన పనులు శరవేగంగా సాగు తున్నాయి. ఐఎఫ్‌ఆర్‌లో భాగమయ్యేందుకు ఇప్పటికే వివిధ దేశాల నేవీ యుద్ధ నౌకలు, సబ్‌ మెరైన్లు విశాఖకు చేరుకుంటున్నాయి. తీరానికి దగ్గరగా చేరడంతో వాటిని తిలకించేందుకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే, ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), మిలాన్‌-2026లో భాగంగా ఆదివారం మిలాన్‌ విలేజ్‌ను తూర్పు నౌకాదళ వైస్‌ అడ్మిరల్‌ సంజయ్‌ భళ్లా ప్రారంభించారు.

Updated Date - Feb 16 , 2026 | 01:14 AM