క్యూబా పబ్‌లో ఘర్షణ
ABN , Publish Date - Oct 05 , 2026 | 01:09 AM
బీచ్‌రోడ్డు వుడా పార్కు పక్కన ఉన్న క్యూబా పబ్‌లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డాన్స్ చేస్తున్న క్రమంలో మొదలైన వివాదం.. ఘర్షణకు దారితీయగా, వారిని బయటకు పంపే క్రమంలో బౌన్సర్లు ఇద్దరిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి...
బౌన్సర్ల దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మద్దిలపాలెం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి):
బీచ్‌రోడ్డు వుడా పార్కు పక్కన ఉన్న క్యూబా పబ్‌లో శనివారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డాన్స్ చేస్తున్న క్రమంలో మొదలైన వివాదం.. ఘర్షణకు దారితీయగా, వారిని బయటకు పంపే క్రమంలో బౌన్సర్లు ఇద్దరిపై దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలను కొందరు సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి...
సీతమ్మధారకు చెందిన చింతాడ సాయివంశీ, చింతాడ తేజస్ మరో ఆరుగురితో కలిసి శనివారం రాత్రి క్యూబా పబ్‌కు వెళ్లారు. అక్కడ నృత్యం చేస్తున్న క్రమంలో మరో యువకుల బృందంతో గొడవ జరిగింది. పబ్ బౌన్సర్లు ఇరువర్గాలను బలవంతంగా బయటకు పంపించారు. పబ్ బయట కూడా గొడవ జరుగుతుండడంతో రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు సాయివంశీ, తేజస్‌లపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వెంటనే వారిని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు బాధితులు ఆదివారం త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణ, వంశీ, మహేష్, బౌన్సర్లు రాజు, శ్రీను, మరో పదిమంది తమపై దాడిచేశారని పేర్కొన్నారు. ఈ మేరకు సీఐ అప్పలనాయుడు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.