Share News

అల్లూరి పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:41 AM

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి పార్కులోని అల్లూరి, గంటందొర సమాధులు, విగ్రహాలకు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా కృష్ణాదేవిపేట రామాలయం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, డివిజన్‌, మండలస్థాయి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.

అల్లూరి పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శం
అల్లూరి, గంటందొరల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్న స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, ఎమ్మెల్యే రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, తదితరులు

- స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు

- ఘనంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి

- కృష్ణాదేవిపేట అల్లూరి పార్కులో సందడి

కృష్ణాదేవిపేట, జూలై 4(ఆంధ్రజ్యోతి): విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శనివారం గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో గల అల్లూరి పార్కులోని అల్లూరి, గంటందొర సమాధులు, విగ్రహాలకు స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా, తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా కృష్ణాదేవిపేట రామాలయం నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు, డివిజన్‌, మండలస్థాయి అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో స్పీకర్‌ అయ్యన్న మాట్లాడుతూ అల్లూరిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత దేశంపై ప్రేమ, సమాజం పట్ల బాధ్యత, ప్రజలకు సేవ చేయాలనే తపన అలవర్చుకోవాలన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో అల్లూరి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చడంతో పాటు స్మారక చిహ్నాల నిర్మాణం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. పార్కులో రాబోయే రోజుల్లో పర్యాటకుల కోసం డైనింగ్‌ హాల్‌ నిర్మాణంతో పాటు పార్కు వెనుక భాగంలో ప్రహరీగోడ నిర్మిస్తామన్నారు. పార్కులో గిరిజన సహకార సంస్థ (జీసీసీ)ఉత్పత్తులు, అరకు కాఫీ స్టాల్‌ ఏర్పాటు చేయాలని, వయస్సు పైబడిన వాచ్‌మన్‌ స్థానంలో కొత్తవారిని నియమించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ అల్లూరి త్యాగం మరువలేనిదన్నారు. కలెక్టర్‌ విజయకృష్ణన్‌ మాట్లాడుతూ చరిత్ర పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచేలా ఆయన స్ఫూర్తితో మెలగాలన్నారు. ప్రొఫెసర్‌ మల్లికార్జునరావు రచించిన అల్లూరి జీవిత చరిత్ర పుస్తకాన్ని స్పీకర్‌ అయ్యన్న, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కలెక్టర్‌ ఆవిష్కరించారు. అలాగే అల్లూరి చరిత్ర పోటీల్లో మండల ప్రథమ స్థానంలో నిలిచిన చోద్యం హైస్కూల్‌ విద్యార్థిని ఎన్‌.ప్రణీతను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, నర్సీపట్నం ఆర్‌డీవో రమణ, పర్యాటకశాఖ ఈఈలు రమణ, విజయభాస్కరరెడ్డి, డీఈ సత్యనాయణ, తహశీల్దార్‌ శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీవీ ప్రసాద్‌, జనసేన నాయకులు రాజాన సూర్యచంద్ర, జడ్పీటీసీ సభ్యురాలు రమణమ్మ, టీడీపీ గొలుగొండ మండల అఽధ్యక్షుడు చిటికెల తారకవేణుగోపాల్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు, ఎంపీటీసీ రుత్తల రామకృష్ణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ అధికారులు, నాలుగు మండలాల అధికారులు, కూటమి నాయకులు, అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2026 | 12:41 AM