సీట్ల సర్దుబాటుపై కూటమి నేతల భేటీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 01:03 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి కూటమి నేతలు బుధవారం టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
నేడు మరోసారి సమావేశం
53వ వార్డు నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కుమార్తె పోటీ?
విశాఖపట్నం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి):
స్థానిక సంస్థల ఎన్నికల్లో ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించడానికి కూటమి నేతలు బుధవారం టీడీపీ కార్యాలయంలో సమావేశమయ్యారు. జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి, స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు షరీఫ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్టాభి, ఎమ్మెల్యేలు గణబాబు, వెలగపూడి, పంచకర్ల రమేశ్బాబు, విష్ణుకుమార్రాజు, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామ్, మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జీ, దక్షిణం ఇన్చార్జి సీతంరాజు సుధాకర్, పార్టీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ట, తదితరులు భేటీ అయ్యారు. ఎవరికి ఎక్కడెక్కడ ఆసక్తి ఉందో మాట్లాడుకున్నారు. ఏ పార్టీ అభ్యర్థి రంగంలో ఉన్నా గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. నూరుశాతం స్థానాలు దక్కించుకునేలా పనిచేయాలన్నారు. గురువారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా టీడీపీ అధిష్టానం కార్పొరేటర్ అభ్యర్థులకు సంబంఽధించి వార్డుకు మూడేసి పేర్లు సూచించాలని కోరింది. అందులో నుంచి ఒకరికి అవకాశం కల్పిస్తారని సమాచారం.
53వ వార్డు నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు కుమార్తె పోటీ
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 53వ వార్డు నుంచి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కుమార్తె శ్యామల దీపికి బీజేపీ తరఫున పోటీ చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.