పల్లె పోరులో కూటమి, వైసీపీ పోటా పోటీ
ABN , Publish Date - Nov 27 , 2026 | 01:58 AM
పల్లె పోరులో కూటమి, వైసీపీ పోటా పోటీ
- మొత్తం 66 పంచాయతీలకు కూటమికి 27, వైసీపీకి 29 సర్పంచులు
- కొయ్యూరులో అత్యధికంగా 13 పంచాయతీలు గెలుచుకున్న టీడీపీ, మరో 4 పంచాయతీల్లో టీడీపీ రెబల్ అభ్యర్థుల గెలుపు
- చింతపల్లి, జీకేవీధి మండలాల్లో హోరాహోరీ
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కూటమి, వైసీపీ పోటాపోటీగా సర్పంచ్ పదవులను దక్కించుకున్నాయి. జిల్లాలో తొలి విడత చింతపల్లి మండలంలో 17, జీకేవీధిలో 16, కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. అయితే కొయ్యూరు మండలం బాలారం పంచాయతీ ఏకగ్రీవం(టీడీపీ మద్దతు) కాగా, మిలిగిన 32 పంచాయతీలు కలిపి మొత్తం 65 పంచాయతీలకు గురువారం ఎన్నికలు జరిగాయి. వాటిలో కొయ్యూరు మండలంలో 33 పంచాయతీలకు టీడీపీ 13, బీజేపీ 1, వైసీపీ 14, టీడీపీ రెబల్ 4, ఇతరులు 1 సర్పంచ్ పదవులను దక్కించుకున్నారు. అలాగే చింతపల్లి మండలంలోని 17 పంచాయతీలకు టీడీపీ 6, జనసేన 1, బీజేపీ 0, వైసీపీ 8, ఇతరులు 2 సర్పంచులుగా గెలుపొందారు. తాజంగి, చౌడుపల్లి పంచాయతీల ఫలితాలు వెలువడించాల్సి ఉంది. అలాగే జీకేవీధి మండలంలో 16 పంచాయతీలకు టీడీపీ 3, జనసేన 3, వైసీపీ 7, ఇతరులు 3 సర్పంచులను దక్కించుకున్నాయి. ఎన్నికలు జరిగిన మూడు మండలాల్లోనూ కూటమి, వైసీపీలుపోటాపోటీగా సర్పంచులను కైవసం చేసుకోవడం విశేషం.
కొయ్యూరులో వైసీపీ 14, టీడీపీ 13, టీడీపీ రెబల్ 4
కొయ్యూరు: మండలంలోని 33 పంచాయతీలలో బాలారం పంచాయతీ ఏకగ్రీవంగా టీడీపీ చేజిక్కించుకోగా, మిగిలిన 32 పంచాయతీలలో గురువారం ఎన్నికలు జరిగాయి. వీటిలో 14 పంచాయతీలు వైసీపీ మద్దతుదారులు, 12 టీడీపీ మద్దతుదారులు, నాలుగు టీడీపీ రెబల్ అభ్యర్థులు, ఒకటి బీజేపీ, మరొకటి ఇండిపెండెంట్ దక్కించుకున్నారు. రేవళ్ళు పంచాయతీలో జన్ని నాగేంద్రప్రసాద్(వైసీపీ) తన పత్యర్ధి లోతా వెంకటరావు(టీడీపీ)పై 152 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతాడ పంచాయతీలో రీముల రేవతి(టీడీపీ)పై సుర్ల సలోమి(వైసీపీ) 212 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. కొయ్యూరు పంచాయతీలో సురబోయిన దివ్యకుమారి (వైసీపీ) తన ప్రత్యర్ధి దుమంతి వెంకట సత్యకుమారి(టీడీపీ)పై 14 ఓట్ల మెజారిటీతో, వెలగలపాలెంలో ఇరవాడ సత్యనారాయణ (టీడీపీ) తన ప్రత్యర్థి గొడ్డేటి కుమార్(వైసీపీ)పై 14 ఓట్ల మెజారిటీతో, రత్నంపేటలో అరిమెల రాజబాబు(బీజేపీ)పై లింగేటి శంకరరావు(టీడీపీ)69 ఓట్ల మెజారిటీతో, బట్టపణుకులలో తాళ్ళ వెంకట కృష్ణవేణి(టీడీపీ రెబల్) తన ప్రత్యర్థి గడుతూరి తులసి(వైసీపీ)పై 62 ఓట్ల మెజారిటీతో, మఠంభీమవరంలో పల్లాల కల్యాణి(టీడీపీ)పై కోండ్ల చిలకమ్మ(వైసీపీ) 96 ఓట్ల మెజారిటీతో, ఆర్.కొత్తూరులో కిలే కాంతామణి(వైసీపీ)పై కిలే సత్యవతి(టీడీపీ)15 ఓట్ల మెజారిటీతో, గధభపాలెంలో ఉల్లి శ్రీనివాసరావు(వైసీపీ)పై పొట్టుకూరి నూకరాజు(టీడీపీ) 260 ఓట్ల మెజారిటీతో, ఆడాకులలో సాగరి నాగమణి(టీడీపీ)పై గమధం రాములమ్మ (వైసీపీ) 42 ఓట్ల మెజారిటీతో, కొండ గోకిరిలో నడిగట్ట శివలక్ష్మి(టీడీపీ)పై పల్లి అనసూయ(వైసీపీ) 81 ఓట్ల మెజారిటీతో గెలిచారు. నడింపాలెం లో దూరి రాజబాబు (వైసీపీ)పై లోతా అప్పలకొండ(టీడీపీ రెబల్)ఒక్క ఓటు మెజారిటీతో, పి.మాకవరంలో లోతా భీమరాజు(టీడీపీ)పై సెగ్గే నూకరాజు(వైసీపీ) 19 ఓట్ల మెజారిటీతో, బంగారమ్మపేటలో మాదల లోవకుమార్(టీడీపీ)పై కొప్పు దుర్గారావు (వైసీపీ) 350 ఓట్ల మెజారిటీతో, శరభన్నపాలెంలో పనసల ఇందిర(టీడీపీ రెబల్)పై ౖలోకుల అచ్యుతవాణి(బీజేపీ) 30 ఓట్ల మెజారిటీతో, చిట్టింపాడులో పాడి ధారలక్ష్మి(వైసీపీ)పై సుర్ల వరలక్ష్మి (టీడీపీ) 100 ఓట్ల మెజారిటీతో, మంపలో సలిమితి పద్మప్రియ(వైసీపీ) పై కోసూరి వరలక్ష్మి(టీడీపీ) 214 ఓట్ల మెజారిటీతో, నల్లగొండలో కోనేపు అచ్యుతరావు (వైసీపీ)పై లోతా వరలక్ష్మి(టీడీపీ) 108 ఓట్ల మెజారిటీతో, కినపర్తిలో లోతా సావిత్రి (వైసీపీ)పై సుర్ల దుర్గాభవాని(టీడీపీ రెబల్) 105 ఓట్ల మెజారిటీతో, రావణాపల్లిలో పొడుగు చంద్రరావు(వైసీపీ)పై సప్పి శ్రీనివాసరావు(టీడీపీ) 32 ఓట్ల మెజారిటీతో, మూలపేటలో బిత్తర దేవి(టీడీపీ)పై రావుల వెంకటలక్ష్మి(వైసీపీ), కంఠారంలో ముంజే లోవ ప్రసాద్(వైసీపీ)పై భూమన నూకరాజు(టీడీపీ) 12 ఓట్ల మెజారిటీతో, చింతలపూడిలో ఉల్లి కన్నబాబు(టీడీపీ)పై సెగ్గే విజయ్‌కుమార్(వైసీపీ) 22 ఓట్ల మెజారిటీతో, యు.చీడిపాలెంలో దడాల రమేశ్(వైసీపీ)పై వంపూరి చంద్రకళ(టీడీపీ) 140 ఓట్ల మెజారిటీతో, చీడిపాలెంలో నత్తూరి జానకి (వైసీపీ)పై జనుమూరి సత్యవతి(టీడీపీ) 28 ఓట్ల మెజారిటీతో, కొమ్మికలో దూపం రాణి(వైసీపీ)పై గోరా రాజేశ్వరి(టీడీపీ రెబల్) 4 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బూదరాళ్ళలో సాగిని రాజారావు(టీడీపీ)పై కొర్రా తిరుపతిరావు(వైసీపీ) 331 ఓట్ల మెజారిటీతో, రాజేంద్రపాలెంలో అంబటి రామారావు(టీడీపీ)పై నర్సి కృష్ణ (వైసీపీ) 78 ఓట్ల మెజారిటీతో, డౌనూరులో సుర్ల జ్యోతి(వైసీపీ)పై ముర్ల జోగులమ్మ( టీడీపీ రెబల్) 26 ఓట్ల మెజారిటీతో, మర్రివాడలో జోరంగ రామారావు(వైసీపీ)పై పొత్తూరు రాజారావు(టీడీపీ) 116 ఓట్ల మెజారిటీతో, బకులూరులో కూడా లక్ష్మి (టీడీపీ)పై బూసరి చంద్రకుమారి(స్వతంత్ర అభ్యర్ధి) 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
చింతపల్లిలో...
చింతపల్లి : మండలంలోని మెజారిటీ సర్పంచ్ స్థానాలను వైసీపీ బలపరిచిన అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. చింతపల్లి మేజర్ పంచాయతీలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందారు. మండలంలోని 17 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో చింతపల్లి మేజర్ పంచాయతీలో రీమల వరహాలమ్మ(టీడీపీ) తన ప్రత్యర్థి దురియా పుష్పలత(వైసీపీ)పై 857 ఓట్ల మెజారిటీతో, గొందిపాకలు పంచాయతీలో బౌడు లింగమూర్తి(టీడీపీ) తన ప్రత్యర్థి కిల్లో రమేశ్(వైసీపీ)పై, కిటుములలో గుడుతూరి రాధాకృష్ణ(టీడీపీ) తన ప్రత్యర్థి వనుము పోతురాజు(వైసీపీ)పై, యర్రబొమ్మలులో బురిటీ భవాని(టీడీపీ) తన ప్రత్యర్థి లోచలి చిన్నారి(వైసీపీ)పై, తమ్మంగులలో వంతల లక్ష్మి(టీడీపీ) తన ప్రత్యర్థి వనికెడి దేవామణి(వైసీపీ)పై, బలపం లో కొర్ర రాములమ్మ(జనసేన) తన ప్రత్యర్థి గబులంబి రాములమ్మ(వైసీపీ)పై, లంబసింగిలో కొర్ర రాఘునాథ్(వైసీపీ) తన ప్రత్యర్థి గొర్లి వెంకట రమణ(టీడీపీ)పై, కొమ్మంగిలో పాంగి గణబాబు(వైసీపీ) తన ప్రత్యర్థి వంతల లక్ష్మణరావు(టీడీపీ)పై, అన్నవరంలో సిందేరి లక్ష్మి(వైసీపీ) తన ప్రత్యర్థి మువ్వల లక్ష్మి(టీడీపీ)పై, బెన్నవరంలో వంతల రాము(వైసీపీ) తన ప్రత్యర్థి సన్యాసమ్మ(టీడీపీ)పై, కుడుముసారిలో పాంగి సుబ్బారావు(వైసీపీ) తన ప్రత్యర్థి గెమ్మెలి బంగారయ్య(టీడీపీ)పై, లోతుగెడ్డలో కొర్ర పద్మ(వైసీపీ) తన ప్రత్యర్థి చింతర్ల గంగా ప్రవీణ(టీడీపీ)పై, పెదబరడలో సమిడి సోములమ్మ(వైసీపీ) తన ప్రత్యర్థి మర్రి సింగారి(కాంగ్రెస్)పై, ఎ.శనివారంలో కిల్లో చిన్నమ్మ(ఇండి)తన ప్రత్యర్థి సాగిన నాగేంద్ర ప్రసాద్‌పై విజయం సాధించారు. అత్యల్పంగా 12 ఓట్ల మెజారిటీతో కుడుముసారి సర్పంచ్ పాంగి సుబ్బారావు(వైసీపీ), అత్యధికంగా 857 ఓట్ల మెజారిటీతో చింతపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రీమల వరలక్ష్మి గెలుపొందారు. చౌడుపల్లిలో వంతల శ్రీనుబాబు(జనసేన)పై కోరాబు కరుణానిధి(వైసీపీ రెబల్), కొత్తపాలెంలో పూర్ణచంద్రరావు(టీడీపీ)పై వణగల బెన్నిబాబు(వైసీపీ) గెలుపొందారు. తాజంగిలో కిలో సదాశివ(వైసీపీ)పై ఆడ్రాబు లక్ష్మయ్య(టీడీపీ) విజయం సాధించారు.
జీకే వీధిలో...
గూడెంకొత్తవీధి: మండలంలో మెజారిటీ సర్పంచ్ స్థానాలను వైసీపీ సొంతం చేసుకున్నది. గురువారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అమ్మవారి ధారకొండలో గుంట ఆనందరావు(టీడీపీ), గుమ్మిరేవుల జోరంగి వెంకట రమణ(వైసీపీ), వంచుల గెమ్మెలి సాంబశివరావు(వైసీపీ), ధారకొండ మడకం గంగా భవాని(వైసీపీ), సీలేరు వంతల దీనమణి(జనసేన), గాలికొండ పొత్తూరు రాజులమ్మ(వైసీపీ), జర్రెల బురిశెట్టి రత్నకుమారి(వైసీపీ), దుప్పులవాడ అల్లంకి రాజు(కాంగ్రెస్), మొండిగెడ్డ పాతూరు లింగమూర్తి(టీడీపీ) దేరాపల్లి గడుతూరి సాయి కుమారి(టీడీపీ), లక్కవరపుపేట వంతల సుబ్బలక్ష్మి(వైసీపీ), సంకాడ ఊలం ఈశ్వర్(జనసేన), పెదవలస గెమ్మెలి కాంతమ్మ(ఇండి), రింతాడ గుంట కోటేశ్వరరావు(జనసేన), దామనాపల్లి కుందరి సత్యవతి (వైసీపీ), జీకేవీధి అంపురంగి బుజ్జిబాబు(సీపీఎం) అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలుపొందారు.