Share News

ఆశలన్నీ పోలవరం పైనే..

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:51 AM

పోలవరం ఎడమ కాలువ నీటి కోసం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని పలు గ్రామాల ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరు రెండో తేదీన ఎడమ కాలువలోకి గోదావరి జిలాలను విడుదల చేసిన అనంతరం పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే. పోలవరం ఎడమ కాలువ నుంచి తాండవ నదీలోకి నీటిని విడుదల చేయడానికి స్థానిక షుగర్‌ ఫ్యాక్టరీ వెనుక ప్రత్యేకంగా ఛానెల్‌ తవ్వకం పనులు చేపట్టారు. దీనిద్వారా భూమి ఆనకట్ట కాలువకు, తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తారు. నదిలో దిగువున ఉన్న ముఠా ఆనకట్ట నుంచి పంట కాలువలకు నీరు సరఫరా అవుతుంది. దీంతో రెండు మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగుకు నీరు అందుతుందని రైతులు ఆశాభావంతో వున్నారు.

ఆశలన్నీ పోలవరం పైనే..
పెంటకోటలో వరినాట్లు వేయక ఖాళీగా ఉన్న పొలాలు

ఎడమ కాలువ నుంచి తాండవ నదిలోకి నీరు

‘పేట వద్ద ప్రత్యేకంగా ఛానెల్‌ తవ్వకం

నదిపై ఉన్న భూమి, ముఠా ఆనకట్టల ద్వారా పంట కాలువలకు నీరు

ఎనిమిది వేల ఎకరాల ఆయకట్టు

వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు పోలవరం నీటిని ఇవ్వాలని రైతుల వినతి

పాయకరావుపేట రూరల్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం ఎడమ కాలువ నీటి కోసం పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లోని పలు గ్రామాల ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెప్టెంబరు రెండో తేదీన ఎడమ కాలువలోకి గోదావరి జిలాలను విడుదల చేసిన అనంతరం పాయకరావుపేట వద్ద నిర్వహించే జలహారతి కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే. పోలవరం ఎడమ కాలువ నుంచి తాండవ నదీలోకి నీటిని విడుదల చేయడానికి స్థానిక షుగర్‌ ఫ్యాక్టరీ వెనుక ప్రత్యేకంగా ఛానెల్‌ తవ్వకం పనులు చేపట్టారు. దీనిద్వారా భూమి ఆనకట్ట కాలువకు, తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తారు. నదిలో దిగువున ఉన్న ముఠా ఆనకట్ట నుంచి పంట కాలువలకు నీరు సరఫరా అవుతుంది. దీంతో రెండు మండలాల్లో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో వరి సాగుకు నీరు అందుతుందని రైతులు ఆశాభావంతో వున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతోపాటు తాండవ నదిలో నీరు ప్రవహించకపోవడంతో పాయకరావుపేట మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. తాండవ నదిపై వున్న భూమి, ముఠా ఆనకట్టల నుంచి కాలువలకు చుక్క నీరు ప్రవహించడంలేదు. దీంతో వివిధ గ్రామాల పరిధిలో సుమారు ఎనిమిది వేల ఎకరాల్లో ఇంతవరకు వరినాట్లు పడలేదు. ఏటా ఆగస్టులో తాండవ నదిలో వరద నీటి ప్రవాహం ఉధృతంగా వుంటుంది. దీంతో ఆనకట్టల నుంచి కాలువలకు పుష్కలంగా నీరు ప్రవహిస్తుంది. ఇదే సమయంలో వర్షాలు కూడా సమృద్ధిగా కురుస్తుండడంతో రైతులు పొలాలను దమ్ముపట్టి, వరినాట్లు వేస్తుంటారు. కానీ ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా వుంది. మూడు నెలల నుంచి వర్షాలు లేకపోవడంతో తాండవ నదిలో నీటి ప్రవాహం లేదు. ఆనకట్టల నుంచి కాలువలకు నీరు ప్రవహించడంలేదు. మరోవైపు కనీసస్థాయిలో కూడా వర్షాలు పడకపోవడంతో మడుల్లో వరి నారు ఎండిపోతున్నది. ఈ నేపథ్యంలో పోలవరం ఎడవ కాలువకు రెండో తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించడం, పాయకరావుపేట వద్ద జరిగే జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానుండడంతో అన్నదాతల మోముల్లో ఆశలు చిగురించాయి. పోలవరం కాలువ నుంచి తాండవ నదిలోకి నీటిని విడుదల చేయడానికి (షుగర్‌ ఫ్యాక్టరీ వెనుక) రెగ్యులేటర్‌ నిర్మించారు. ఇక్కడి నుంచి తాండవ నది వరకు అత్యవసరంగా ఛానెల్‌ తవ్వుతున్నారు. ఎడమ కాలువ నీటిని ఈ ఛానెల్‌ ద్వారా తాండవ నదిలోకి విడుదల చేస్తే.. అక్కడి నుంచి భూమి, ముఠా ఆనకట్టల నుంచి పంట కాలువలకు నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం తాండవ నదిలో ఎగువ నుంచి చుక్క నీరు రావడంలేదు. ఇటువంటి తరుణంలో పోలవరం ఎడమ కాలువ నుంచి తాండవకు నీటిని వదిలితే.. ఖరీఫ్‌లో వర్షాభావం నుంచి బయటపడి, వరి సాగు చేసుకుంటామని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎగువున వర్షాలు కురిసి, తాండవ నదిలో వరద నీరు ప్రవహించే వరకు, పోలవరం ఎడమ కాలవ నుంచి తాండవ నదిలోకి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Aug 31 , 2026 | 12:51 AM