Share News

ఎబోలాపై అప్రమత్తం

ABN , Publish Date - May 25 , 2026 | 12:22 AM

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌పై జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది.

ఎబోలాపై అప్రమత్తం

ఆరోగ్యశాఖ సత్వర చర్యలు

ప్రభుత్వ ఆదేశాలతో ఎయిర్‌పోర్టు, పోర్టులో విదేశీ ప్రయాణికుల తనిఖీ

ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో ఐసోలేషన్‌ వార్డు

అనుమానితులను 21 రోజులు ఐసోలేట్‌ చేసేలా చర్యలు

విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి):

ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌పై జిల్లా ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. నగర పరిధిలోని పలు వర్సి టీలు, కాలేజీల్లో ఆఫ్రికాదేశాలకు చెందిన విద్యార్థులు ఉన్న తవిద్యను అభ్యసిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాద వ్‌ హెచ్చరికలతో జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు రంగంలోకి దిగారు. కాంగో, సూడాన్‌, ఉగాండా తదితర దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టు, పోర్టు లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. అనుమా నిత లక్షణాలున్న వారి నుంచి నమూనాలను సేకరిస్తారు. ఈ మేరకు రెండుచోట్ల ఇద్దరు సూపర్‌వైజర్లను నియమించారు. ఆయా దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్లో జ్వరం, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, రక్తస్రావం కావడం వంటి లక్షణాలు గుర్తిస్తే వారిని 21 రోజులపాటు క్వారంటైన్‌ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు పెద వాల్తేరులోని ఛాతి, అంటువ్యాధుల ఆస్పత్రిలో 30 పడకల తో ఎబోలా ఐసోలేషన్‌ వార్డును సిద్ధం చేస్తున్నారు.

పుణేకు నమూనాలు

అనుమానితుల నుంచి నమూనాలను సేకరించే బాధ్య తను కేజీహెచ్‌లోని వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ సిబ్బందికి అప్పగిం చారు. వీటిని పుణేలోని ల్యాబ్‌కు పంపించనున్నారు. ఫలి తాలు వచ్చే వరకు అనుమానితులను ఛాతి ఆస్పత్రిలో ఐసోలేట్‌ చేయనున్నారు. వ్యాధి పట్ల వైద్యులకు అవగా హన కల్పించేందుకు ఆంధ్రా మెడికల్‌ కళాశాల మైక్రో బయాలజీ విబాగం ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్‌ ప్రొగ్రా మ్‌ నిర్వహించనున్నారు. ఎబోలా వైరస్‌ వ్యాప్తి చెందు తున్న నేపథ్యంలో ఆఫ్రికా దేశాల నుంచి గత 21 రోజుల్లో ఎవరైనా నగరానికి వస్తే, వారిలో వ్యాధికి సంబంధించిన లక్షణాలుంటే వెంటనే ఆరోగ్యశాఖకు సమాచారం అందిం చాలని అధికారులు కోరుతున్నారు.

Updated Date - May 25 , 2026 | 12:22 AM