Share News

భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్‌లు

ABN , Publish Date - Jul 24 , 2026 | 01:13 AM

నగరం నుంచి అరగంటకొకటి... క్యాబ్‌ సర్వీస్‌లు కూడా ప్రారంభం ప్రధాని సభకు జిల్లా నుంచి 50 వేల మంది అదేరోజు అసిప్‌ టెక్నాలజీస్‌కు వర్చువల్‌గా పీఎం శంకుస్థాపన పింఛన్లు పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు గిరి ప్రదక్షిణ సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేత కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భోగాపురం విమానాశ్రయానికి నగరంలో ఏర్పాటుచేసే లాంజ్‌ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్‌ (ప్రత్యేకమైన/వేగవంతమైన) బస్సునడిపేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం 100 బస్సులు కేటాయించగా, ఇప్పటికే 20 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి బస్సులు పెంచుతామన్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయని, ఓలా, ఉబర్‌ తదితర క్యాబ్‌ సర్వీస్‌లకు అనుమతి వచ్చేలా జీఎంఆర్‌ సంస్థతో చర్చలు జరిపినట్టు తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన రోజు నుంచే క్యాబ్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. విమానాశ్రయానికి నగరం నుంచి అనుసంధానమయ్యే 28 రహదారులను గుర్తించామని, వాటి మొత్తం పొడవు 230 కి.మీ. ఉంటుందన్నారు. ఏడు ప్రధాన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో నాలుగు రోడ్ల పనులు పూర్తికాగా, నెలాఖరుకు మరో రెండు పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తుతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మెట్రో రైలు, డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఆగస్టు ఒకటో తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుచేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. విమానాశ్రయం ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోదీ విమానం ఒక్కటే భోగాపురం ఎయిర్‌పోర్టులో దిగుతుందన్నారు. వాణిజ్య కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత ప్రకటిస్తారన్నారు. అసిప్‌ టెక్నాలజీస్‌ సంస్థకు వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన దేశంలో తొలి ఇండియన్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్‌ ప్రకటించారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు సమీపాన అసిప్‌ టెక్నాలజీస్‌ సంస్థ సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్నదన్నారు. ఆగస్టు ఒకటో తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈనెల 28వ తేదీన సింహాచలం వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ఐదు నుంచి పది లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. హనుమంతువాక నుంచి మద్దిలపాలెం మధ్య సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రించి అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల వివరాలతో ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటుచేస్తామన్నారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు ప్రకటించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల మళ్లింపుపై రెండు కమిటీలు ఏర్పాటుచేశామని, వారి నివేదికల ఆధారంగా ప్రజలకు మార్గదర్శకాలు జారీచేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు. 2.32 లక్షల మందికి తల్లికి వందనం ప్రస్తుత విద్యా సంవత్సరంలో ‘తల్లికి వందనం’ పథకం కింద జిల్లాలో సుమారు 2.32 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.345 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఈ మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఎవరికైనా సొమ్ములు జమ కాకపోతే స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా సమస్యను నమోదుచేసి పరిష్కరించేలా ఒక విధానం తీసుకువచ్చామన్నారు. తల్లిదండ్రులు కూడా లీప్‌ యాప్‌ ద్వారా తల్లికి వందనం స్థితిని తెలుసుకునే వీలుందని, చెల్లింపులు జరగకపోతే స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డును సంప్రతించి బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌ వివరాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అతిపెద్ద డీబీటీ పథకాల్లో తల్లికి వందనం ఒకటని, విద్యా శాఖ ద్వారా కింద సుమారు రూ.10 వేల కోట్ల వరకు ప్రత్యక్ష బదిలీ జరుగుతుందన్నారు. నేడు 605 విద్యా సంస్థల్లో మెగా పీటీఎం జిల్లాలోని 594 పాఠశాలలు, 11 కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ జరగనున్నదని కలెక్టర్‌ వెల్లడించారు. పాఠశాలల్లోని 7,1360 మంది విద్యార్థులు, కళాశాలల్లోని 7,166 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యేలా యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లుచేశాయన్నారు. పిల్లల కోసం ఈ కార్యక్రమానికి ప్రతి తల్లి, తండ్రి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల చదువు, ప్రగతి, ఇతర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం కలుగుతుందన్నారు. చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రభుత్వంతోపాటు జిల్లా యంత్రాంగం కోరుకుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ జె.చంద్రశేఖర్‌, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ఉమారాణి పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి 32 కి.మీ.మార్గంలో ఏడు కంట్రోల్‌ రూమ్‌లు 28న ఆనందపురం వైపు నుంచి వాహనాల ప్రవేశంపై ఆంక్షలు హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వరకు నో వెహికల్‌ జోన్‌ విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు పూర్తి ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. దీనిపై గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరి ప్రదక్షిణకు ఐదు నుంచి ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మార్గాన్ని ఏడు జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ఏడు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆరు షిఫ్టుల్లో అధికారులు పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం 28 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. వృద్ధులు, పిల్లలు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐటీ ట్యాగులు వేస్తామన్నారు. నగరం బయట 58 పార్కింగ్‌ స్థలాలు గుర్తించామన్నారు. బీఆర్‌టీఎస్‌ మార్గంలో వాహనాలు అనుమతించబోమని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. దాతలు ఫుడ్‌ స్టాళ్లను రహదారులపై పెట్టకూడదన్నారు. 29వ తేదీన దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాయన్నారు. 29న సుమారుగా 80 వేల మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించామన్నారు. పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చీ మాట్లాడుతూ, 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు సింహాచలం వైపు వచ్చే భారీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరిలు మాట్లాడుతూ 28న శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలనను కూడా షీలానగర్‌ మీదుగా అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిలోకి మళ్లించడం జరుగుతుందన్నారు. నగరంలో ఆంక్షలు 28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. హనుమంతువాక జంక్షన్‌ నుంచి మద్దిలపాలెం వరకూ రాత్రి 12 గంటల వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని ప్రకటించారు. అలాగే బీచ్‌రోడ్డులోని కురుపాం జంక్షన్‌ నుంచి అప్పుఘర్‌ వరకు నో వెహికల్‌ జోన్‌గా అమలు చేస్తామన్నారు. ఈ నిబంధనలు ప్రజలు పాటించాలని కోరారు.

భోగాపురానికి ఏరో ఎక్స్‌ప్రెస్‌లు

నగరం నుంచి అరగంటకొకటి...

క్యాబ్‌ సర్వీస్‌లు కూడా ప్రారంభం

ప్రధాని సభకు జిల్లా నుంచి 50 వేల మంది

అదేరోజు అసిప్‌ టెక్నాలజీస్‌కు వర్చువల్‌గా పీఎం శంకుస్థాపన

పింఛన్లు పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు

గిరి ప్రదక్షిణ సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేత

కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌

విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

భోగాపురం విమానాశ్రయానికి నగరంలో ఏర్పాటుచేసే లాంజ్‌ల నుంచి ప్రతి అరగంటకు ఒక ఏరో ఎక్స్‌ప్రెస్‌ (ప్రత్యేకమైన/వేగవంతమైన) బస్సునడిపేలా ప్రణాళికలు రూపొందించామని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం 100 బస్సులు కేటాయించగా, ఇప్పటికే 20 ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి బస్సులు పెంచుతామన్నారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులకు ఏసీ బస్సులు అందుబాటులో ఉంటాయని, ఓలా, ఉబర్‌ తదితర క్యాబ్‌ సర్వీస్‌లకు అనుమతి వచ్చేలా జీఎంఆర్‌ సంస్థతో చర్చలు జరిపినట్టు తెలిపారు. విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభమైన రోజు నుంచే క్యాబ్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. విమానాశ్రయానికి నగరం నుంచి అనుసంధానమయ్యే 28 రహదారులను గుర్తించామని, వాటి మొత్తం పొడవు 230 కి.మీ. ఉంటుందన్నారు. ఏడు ప్రధాన మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లలో నాలుగు రోడ్ల పనులు పూర్తికాగా, నెలాఖరుకు మరో రెండు పూర్తిచేస్తామన్నారు. భవిష్యత్తుతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి మెట్రో రైలు, డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్‌ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు.

ఆగస్టు ఒకటో తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లుచేస్తున్నామని కలెక్టర్‌ చెప్పారు. విమానాశ్రయం ప్రారంభం రోజున ప్రధాని నరేంద్రమోదీ విమానం ఒక్కటే భోగాపురం ఎయిర్‌పోర్టులో దిగుతుందన్నారు. వాణిజ్య కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత ప్రకటిస్తారన్నారు.

అసిప్‌ టెక్నాలజీస్‌ సంస్థకు వర్చువల్‌గా ప్రధాని శంకుస్థాపన

దేశంలో తొలి ఇండియన్‌ సెమీకండక్టర్‌ మిషన్‌ ప్రాజెక్టుకు ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని కలెక్టర్‌ ప్రకటించారు. ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్‌ డేటా సెంటర్‌కు సమీపాన అసిప్‌ టెక్నాలజీస్‌ సంస్థ సెమీకండక్టర్‌ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్నదన్నారు. ఆగస్టు ఒకటో తేదీన విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉన్నప్పటికీ సామాజిక పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈనెల 28వ తేదీన సింహాచలం వరాహ నరసింహస్వామి గిరి ప్రదక్షిణకు ఐదు నుంచి పది లక్షల మంది భక్తులు వచ్చినా ఇబ్బందిలేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. హనుమంతువాక నుంచి మద్దిలపాలెం మధ్య సాధారణ వాహనాల రాకపోకలను నియంత్రించి అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల వివరాలతో ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటుచేస్తామన్నారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నట్టు ప్రకటించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, వాహనాల మళ్లింపుపై రెండు కమిటీలు ఏర్పాటుచేశామని, వారి నివేదికల ఆధారంగా ప్రజలకు మార్గదర్శకాలు జారీచేస్తామని కలెక్టర్‌ ప్రకటించారు.

2.32 లక్షల మందికి తల్లికి వందనం

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ‘తల్లికి వందనం’ పథకం కింద జిల్లాలో సుమారు 2.32 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ.345 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. ఈ మొత్తం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామన్నారు. ఎవరికైనా సొమ్ములు జమ కాకపోతే స్వర్ణ గ్రామ/స్వర్ణ వార్డు కార్యాలయంలోని డిజిటల్‌ అసిస్టెంట్ల ద్వారా సమస్యను నమోదుచేసి పరిష్కరించేలా ఒక విధానం తీసుకువచ్చామన్నారు. తల్లిదండ్రులు కూడా లీప్‌ యాప్‌ ద్వారా తల్లికి వందనం స్థితిని తెలుసుకునే వీలుందని, చెల్లింపులు జరగకపోతే స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డును సంప్రతించి బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌ వివరాల్లో అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో అతిపెద్ద డీబీటీ పథకాల్లో తల్లికి వందనం ఒకటని, విద్యా శాఖ ద్వారా కింద సుమారు రూ.10 వేల కోట్ల వరకు ప్రత్యక్ష బదిలీ జరుగుతుందన్నారు.

నేడు 605 విద్యా సంస్థల్లో మెగా పీటీఎం

జిల్లాలోని 594 పాఠశాలలు, 11 కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్‌, టీచర్‌ మీటింగ్‌ జరగనున్నదని కలెక్టర్‌ వెల్లడించారు. పాఠశాలల్లోని 7,1360 మంది విద్యార్థులు, కళాశాలల్లోని 7,166 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యేలా యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లుచేశాయన్నారు. పిల్లల కోసం ఈ కార్యక్రమానికి ప్రతి తల్లి, తండ్రి హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశాల్లో విద్యార్థుల చదువు, ప్రగతి, ఇతర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం కలుగుతుందన్నారు. చదువులో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రభుత్వంతోపాటు జిల్లా యంత్రాంగం కోరుకుంటుందన్నారు. విలేకరుల సమావేశంలో డీఈవో ఎన్‌.ప్రేమ్‌కుమార్‌, సమగ్ర శిక్షా అభియాన్‌ ఏపీసీ జె.చంద్రశేఖర్‌, జిల్లా వృత్తివిద్యాశాఖాధికారి ఉమారాణి పాల్గొన్నారు.


గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

32 కి.మీ.మార్గంలో ఏడు కంట్రోల్‌ రూమ్‌లు

28న ఆనందపురం వైపు నుంచి వాహనాల ప్రవేశంపై ఆంక్షలు

హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వరకు నో వెహికల్‌ జోన్‌

విశాఖపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి):

ఈ నెల 28, 29 తేదీల్లో జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణకు పూర్తి ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ తెలిపారు. దీనిపై గురువారం వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. గిరి ప్రదక్షిణకు ఐదు నుంచి ఆరు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామన్నారు. మొత్తం 32 కిలోమీటర్ల మార్గాన్ని ఏడు జోన్లు, 28 సెక్షన్లుగా విభజించి ఏడు కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఆరు షిఫ్టుల్లో అధికారులు పనిచేస్తారన్నారు. భక్తుల సౌకర్యార్థం 28 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. వృద్ధులు, పిల్లలు తప్పిపోకుండా ఆర్‌ఎఫ్‌ఐటీ ట్యాగులు వేస్తామన్నారు. నగరం బయట 58 పార్కింగ్‌ స్థలాలు గుర్తించామన్నారు. బీఆర్‌టీఎస్‌ మార్గంలో వాహనాలు అనుమతించబోమని, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు. దాతలు ఫుడ్‌ స్టాళ్లను రహదారులపై పెట్టకూడదన్నారు. 29వ తేదీన దేవస్థానం బస్సులతో పాటు 50 ఆర్టీసీ బస్సులు ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాయన్నారు. 29న సుమారుగా 80 వేల మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించామన్నారు.

పోలీస్‌ కమిషనర్‌ శంఖబత్ర బాగ్చీ మాట్లాడుతూ, 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం వరకు సింహాచలం వైపు వచ్చే భారీ వాహనాలపై ఆంక్షలు ఉంటాయన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరిలు మాట్లాడుతూ 28న శ్రీకాకుళం, విజయనగరం వైపు నుంచి నగరంలోకి వచ్చే భారీ వాహనాలకు అనుమతి లేదన్నారు. సిటీ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే వాహనాలనను కూడా షీలానగర్‌ మీదుగా అనకాపల్లి-ఆనందపురం జాతీయ రహదారిలోకి మళ్లించడం జరుగుతుందన్నారు.

నగరంలో ఆంక్షలు

28వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు. హనుమంతువాక జంక్షన్‌ నుంచి మద్దిలపాలెం వరకూ రాత్రి 12 గంటల వరకు ఎటువంటి వాహనాలను అనుమతించబోమని ప్రకటించారు. అలాగే బీచ్‌రోడ్డులోని కురుపాం జంక్షన్‌ నుంచి అప్పుఘర్‌ వరకు నో వెహికల్‌ జోన్‌గా అమలు చేస్తామన్నారు. ఈ నిబంధనలు ప్రజలు పాటించాలని కోరారు.

Updated Date - Jul 24 , 2026 | 01:15 AM