Share News

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో అధునాతన ఓటీలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:36 AM

జిల్లా ఆస్పత్రి అయిన స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయంలో సీఎస్‌ఆర్‌ నిధులతో నవీకరించిన మాడ్యులర్‌, లామినర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ప్రారంభించారు. రోగుల సహాయకులు వేచి ఉండే హాల్‌ను, టిఫా స్కాన్‌ను కూడా కలెక్టర్‌ ప్రారంభించారు.

ఎన్టీఆర్‌ ఆస్పత్రిలో అధునాతన ఓటీలు
అధునాతన ఆపరేషన్‌ థియేటర్‌ను ప్రారంభిస్తున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌. చిత్రంలో ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌ ఉన్నారు.

టిఫా స్కానింగ్‌ యంత్రం

ప్రారంభించిన కలెక్టర్‌ విజయకృష్ణన్‌

పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం

అనకాపల్లి టౌన్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఆస్పత్రి అయిన స్థానిక ఎన్టీఆర్‌ వైద్యాలయంలో సీఎస్‌ఆర్‌ నిధులతో నవీకరించిన మాడ్యులర్‌, లామినర్‌ ఆపరేషన్‌ థియేటర్‌లను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ప్రారంభించారు. రోగుల సహాయకులు వేచి ఉండే హాల్‌ను, టిఫా స్కాన్‌ను కూడా కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఆస్పత్రిలో పారిశుధ్యం మెరుగునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. ఎయిర్‌ఫ్లో టెక్నాలజీతో నిర్మించిన ఆపరేషన్‌ థియేటర్లు సురక్షితమైన, అవసరానికి అనుగుణంగా మార్చుకునే విధంగా వుంటాయన్నారు. ఇన్ఫెక్షన్‌కు అవకాశం చాలా తక్కువ వుంటుందని, సూక్ష్మ క్రిములు, దుమ్ము రాకుండా నిరోధిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి, ఎలమంచిలి ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్‌కుమార్‌, నోవా ప్రో-కంపెనీ ప్రతినిధులు, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ హైమావతి, వైద్యాలయం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణారావు, జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ కె. చక్రవర్తి, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు ఆళ్ల రామచంద్రరావు, తాడి శాంతకుమారి, రామకృష్ణ, గొర్లి శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:36 AM