కూటమిలో ప్రాదేశిక సీట్లు సర్దుబాటు
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:41 AM
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరిందని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి తెలిపారు.
భీమిలి, పద్మనాభం, పెందుర్తి జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ పోటీ
జనసేనకు ఆనందపురం...
53 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి 38, జనసేనకు 12, బీజేపీకి మూడు
టీడీపీ అధ్యక్షుడు చోడే పట్టాభి
విశాఖపట్నం, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య అవగాహన కుదిరిందని పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు చోడే వెంకటపట్టాభి తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ నాలుగు జడ్పీటీసీ స్థానాల్లో మూడు టీడీపీకి, ఒకటి జనసేనకు కేటాయించామన్నారు. టీడీపీకి తరపున భీమిలి నుంచి గాడు నీలవేణి, పద్మనాభంలో కోరాడ సత్యవతి, పెందుర్తిలో సుఖవాసి అజయ్ పోటీ చేస్తారన్నారు. ఆనందపురం జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించామని, అక్కడ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటిస్తుందన్నారు. ఇక 53 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ 38, జనసేన 12, బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయన్నారు. పెందుర్తి మండలంలో గొరపల్లి, సరిపల్లి, ఎస్.ఆర్.పురం, రాంపురం, ఆనందపురంలో ఆనందపురం-2, చందక, గంభీరం, కుసులువాడ, శొంఠ్యాం, తర్లువాడ, వేములవలస, గిడిజాల, కణమాం, మామిడిలోవ, పెద్దిపాలెం, బోని, గొట్టిపల్లి, భీమిలి మండలంలో అమనాం, అన్నవరం, చిప్పాడ, మజ్జిపేట, మూలకుద్దు, పెదనాగమయ్యపాలెం, సింగన్నబంద, తాళ్లవలస, మజ్జివలస, దాకమర్రి, పద్మనాభం మండలంలో ఐనాడ, బాందేవపురం, బీఆర్ తాళ్లవలస, కోరాడ, కృష్ణాపురం, పాండ్రంకి-1, రేవిడి, తునివలస, మద్ది, కొవ్వాడ, పొట్నూరు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి లొడగల కృష్ణ, పార్టీ కార్యాలయ కార్యదర్శి వెంకటేశ్ పాల్గొన్నారు. జనసేనకు పద్మనాభం మండలంలో పాండ్రంకి-2, రెడ్డిపల్లి, గంధవరం, బీజేపీకి అనంతవరం, భీమిలి మండలంలో తాటితూరు, టి.నగరపాలెం, ఆనందపురం మండలంలో ఆనందపురం-1, పాలవలస, వెల్లంకి, ముచ్చెర్ల జనసేనకు, ఆనందపురం-1 బీజేపీకి, పెందుర్తి మండలం పెదగాడి, పినగాడి, రాజయ్యపేట, గుర్రంపాలెం జనసేనకు, బీజేపీకి వాలిమెరక కేటాయించారు.