సమగ్ర శిక్ష ఏపీసీకి అదనపు బాధ్యతలు
ABN , Publish Date - Aug 12 , 2026 | 12:20 AM
స్థానిక సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న డాక్టర్ వీఏ స్వామినాయుడుకు పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు.
- పార్వతీపురం మన్యం జిల్లా విధులు కూడా అప్పగింత
పాడేరు, ఆగస్టు 11(ఆంఽధ్రజ్యోతి): స్థానిక సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా పని చేస్తున్న డాక్టర్ వీఏ స్వామినాయుడుకు పార్వతీపురం మన్యం జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో-ఆర్డినేటర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో సమగ్ర శిక్ష ఏపీసీ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం సాలూరు ఎంఈవోకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే స్థానిక ఏపీసీ స్వామినాయుడు ఉమ్మడి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 22 మండలాలు ఉన్నప్పుడే సమర్థవంతంగా పని చేయడం, ప్రస్తుతం అల్లూరి జిల్లా 11 మండలాలకే పరిమితం కావడంతో ఆయన సేవలను పార్వతీపురం మన్యం జిల్లాలో వినియోగించుకోవాలని రాష్ట్ర అఽధికారులు భావించారు. ఈ మేరకు ఆయనకు అదనంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని సమగ్ర శిక్ష ఏపీసీగా బాధ్యతలు అప్పగించారు.