సుంకరమెట్ట కాఫీ ట్రయల్‌లో అదనపు సొబగులు
ABN , Publish Date - Sep 30 , 2026 | 12:29 AM
సహజసిద్ధ ప్రకృతి అందాల సుంకరమెట్ట కాఫీ ట్రయల్‌లో మరిన్ని సదుపాయాలు సమకూరాయి. పర్యాటకులను ఆకర్షించేలా మరో కెనోపీ వాక్ (ఉడెన్ బ్రిడ్జి) 350 మీటర్ల పొడవున నిర్మించారు. రానున్న పర్యాటక సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులు సుంకరమెట్ట కాఫీ తోటల్లో రెండవ ఉడెన్ బ్రిడ్జిని సిద్ధం చేశారు.
- మరో ఉడెన్ బ్రిడ్జి సిద్ధం
- అందుబాటులోకి ధింసా డిలైట్ కాఫీ పాయింట్, ట్రీ రెస్టారెంట్
- పర్యాటకులకు మరిన్ని సదుపాయాలు
అరకులోయ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సహజసిద్ధ ప్రకృతి అందాల సుంకరమెట్ట కాఫీ ట్రయల్‌లో మరిన్ని సదుపాయాలు సమకూరాయి. పర్యాటకులను ఆకర్షించేలా మరో కెనోపీ వాక్ (ఉడెన్ బ్రిడ్జి) 350 మీటర్ల పొడవున నిర్మించారు. రానున్న పర్యాటక సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఏపీఎఫ్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులు సుంకరమెట్ట కాఫీ తోటల్లో రెండవ ఉడెన్ బ్రిడ్జిని సిద్ధం చేశారు. ఉడెన్ బ్రిడ్జిపై ఫొటోలు దిగేందుకు వ్యూపాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 600 మీటర్ల పొడవున ఉడెన్ బ్రిడ్జి ఉండగా, కొత్తగా మరొకటి సిద్ధం కావడంతో పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని పంచనుంది. అలాగే ఇక్కడ ధింసా డిలైట్ కాఫీ పాయింట్, ట్రీ రెస్టారెంట్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ అన్ని రకాల వంటకాలతో పాటు గిరిజన సంప్రదాయ వంటకాలు కూడా ఆర్డర్‌పై సిద్ధం చేస్తున్నారు. సందర్శకులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పర్యాటక సీజన్‌లో మరింత రద్దీ పెరిగే అవకాశం ఉంది.