నూకయ్యబంద చెరువు ఆక్రమణపై చర్యలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:41 AM
మండలంలోని కొమిర రెవెన్యూలో నూకయ్యబంద చెరువు ఆక్రమణకు గురైందని రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై తహశీల్దార్ శ్రీనివాసరావు స్పందించారు. వెంటనే చెరువును సర్వే చేయాలని వీఆర్‌వో, సర్వేయర్‌ను ఆయన ఆదేశించారు.
- సర్వే చేయాలని తహసీల్దార్ ఆదేశం
- ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చిన వీఆర్‌వో
గొలుగొండ, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమిర రెవెన్యూలో నూకయ్యబంద చెరువు ఆక్రమణకు గురైందని రైతులు ఇచ్చిన ఫిర్యాదుపై తహశీల్దార్ శ్రీనివాసరావు స్పందించారు. వెంటనే చెరువును సర్వే చేయాలని వీఆర్‌వో, సర్వేయర్‌ను ఆయన ఆదేశించారు. దీంతో శనివారం ఆక్రమణ దారులకు వీఆర్‌వో నోటీసులు ఇచ్చారు. త్వర లో సర్వే చేస్తున్నట్టు చెప్పారు. కొమిర రెవెన్యూలో నూకయ్యబంద చెరువు సుమారు 8 ఎకరాల విస్తీర్ణం కాగా, రెండున్నర ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు రెవెన్యూ అధికారులు గుర్తించినట్టు వీఆర్‌వో తెలిపారు. నలుగురు రైతులు ఆక్రమించుకుని సాగు చేస్తున్నట్టు గుర్తించామన్నారు. ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తహశీల్దార్ తెలిపారు.