పక్కాగా టెన్త్ మూల్యాంకనం
ABN , Publish Date - Apr 10 , 2026 | 12:00 AM
స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు.
కలెక్టర్ టి.నిశాంతి సూచన
పాడేరు, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకన ప్రక్రియను పక్కాగా చేపట్టాలని కలెక్టర్ టి.నిశాంతి సూచించారు. గురువారం మూల్యాంకనం జరుగుతున్న తీరును ఆమె పరిశీలించారు. తొలి రోజు ఈ కేంద్రానికి ప్రైవేటు వ్యక్తులు రావడం, వీడియోలు తీయడంతో పాటు మౌలిక సదుపాయాల సమస్య కలెక్టర్ దృష్టికి రావడంతో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని విద్యాశాఖాధికారులను ఆమె ఆదేశించారు. ఈ కేంద్రంలో మొత్తం లక్షా 7 వేల 581 పరీక్షా పత్రాలను ఈ నెల 6 నుంచి 15 వరకు మూల్యాంకనం చేస్తామని, ప్రస్తుతానికి 36 వేల 992 పత్రాల మూల్యాంకనం పూర్తయిందని కలెక్టర్‌కు డీఈవో రామకృష్ణారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరీక్షల సహాయ కమిషనర్ శశికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.