Share News

పక్కాగా జనగణన

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:30 PM

జిల్లాలో జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జనగణనపై నిర్వహించే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ప్రారంభించారు.

పక్కాగా జనగణన
ఎన్యుమరేటర్లకు సెన్సస్‌ కిట్లు అందిస్తున్న కలెక్టర్‌ టి.నిషాంతి, సబ్‌కలెక్టర్‌ కె.సాహిత్‌

సిబ్బందికి కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశం

పాడేరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జనగణన ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని సిబ్బందిని కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. జనగణనపై నిర్వహించే మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లో బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జనగణన ఆధారంగానే ప్రజలకు ప్రభుత్వ పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందుతాయన్నారు. ఈ క్రమంలో జనగణనకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలని, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. జనగణనపై నిర్వహించే శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని, జనగణన సైతం అత్యంత బాధ్యతాయుతంగా చేపట్టాలన్నారు. ప్రతి ఆవాస ప్రాంతాన్ని సందర్శించి, శత శాతం జనగణన చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా జనగణనకు సంబంధించిన కిట్‌లను ఎన్యుమరేటర్లకు కలెక్టర్‌, తదితరులు అందించారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ కె.సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:31 PM