పక్కాగా జనగణన
ABN , Publish Date - May 27 , 2026 | 11:47 PM
జనగణన, ఓటర్ల మ్యాపింగ్ పక్కాగా జరగాలని సిబ్బందిని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు.
ఓటర్ల మ్యాపింగ్ కూడా..
సిబ్బందికి కలెక్టర్ నిషాంతి ఆదేశం
యండపల్లివలసలో తనిఖీ
అరకులోయ, మే 27 (ఆంధ్రజ్యోతి): జనగణన, ఓటర్ల మ్యాపింగ్ పక్కాగా జరగాలని సిబ్బందిని కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. మండలంలోని యండపల్లివలస గ్రామంలో జరుగుతున్న జనగణన, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను బుధవారం ఆమె తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో ఎన్యుమరేటర్లు, బూత్ లెవెల్ అధికారులు నిర్వహిస్తున్న విధులను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వారితో ఆమె మాట్లాడుతూ మండలంలో శతశాతం ఓటర్ల మ్యాపింగ్ చేపట్టాలని, జనగణన పారదర్శకంగా జరగాలని సూచించారు. అధికారులు, సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జనగణన, ఓటర్ల మ్యాపింగ్‌పై గ్రామస్థులతో కలెక్టర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమె వెంట జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్ లోకేశ్వరరావు, అరకులోయ ఎంపీడీవో వి.ప్రసాద్, ఎన్యుమరేషన్ సూపర్‌వైజర్లు ఎ.వై.పాత్రుడు, బీఎల్‌వోలు, స్థానిక రెవెన్యూ అధికారులు, తదితరులు ఉన్నారు.