Share News

పక్కాగా జనగణన

ABN , Publish Date - Mar 23 , 2026 | 11:23 PM

దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, దానిని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. జనగణనపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు.

పక్కాగా జనగణన
మాట్లాడుతున్న కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌

జనగణనపై మూడు రోజుల శిక్షణ ప్రారంభం

పాడేరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి): దేశాభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, దానిని పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ అన్నారు. జనగణనపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ శిక్షణలో ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా నేర్చుకోవాలన్నారు. అల్లూరి జిల్లాలో మండలానికి ఇద్దరు చొప్పున మొత్తం 22 మంది సమర్థులైన ఉపాధ్యాయులను ఈ శిక్షణకు ఎంపిక చేశామన్నారు. వారికి మాస్టర్‌ ట్రైనర్లు మూడు రోజులు శిక్షణ ఇస్తారని, శిక్షణ పొందిన టీచర్లు మండల స్థాయిలో ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తారన్నారు. జనగణన- 2027కు సంబంధించి పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలోనే జరుగుతుందని, క్షేత్రస్థాయి సమాచారాన్ని సైతం డిజిటల్‌ రూపంలోనే నమోదు చేయాలన్నారు. అందుకు గాను హలో యాప్‌ను రూపొందించారన్నారు. జనగణన సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో నమోదు చేయడం ద్వారా తప్పులు లేకుండా పక్కాగా ఉంటుందన్నారు. ముఖ్యంగా శిక్షణ పొందుతున్న టీచర్లు సాంకేతిక అంశాలపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అలాగే జనగణన- 2027లో భాగంగా ప్రజల నుంచి పక్కా, సమగ్ర సమాచారాన్ని పొందాలని కలెక్టర్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, జిల్లా రెవెన్యూ అధికారి పి.అంబేడ్కర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ నీలకంఠం, మాస్టర్‌ ట్రైనర్లు బి.త్రినాథరావు, పి.జానకీరావు, జిల్లాలోని ఎంపిక చేసిన టీచర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 11:24 PM