Share News

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Nov 22 , 2026 | 11:54 PM

రెండో సాధారణ గ్రామ పంచాయతీలకు సంబంధించి జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగియనుంది.

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల స్వీకరణ
పాడేరు మండలంలోని పంచాయతీ కార్యాలయం

రెండు రోజుల్లో సర్పంచులకు 454, వార్డులకు 943 నామినేషన్లు దాఖలు

27న ఉపసంహరణ

2న ఎన్నికలు

పాడేరు, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ గ్రామ పంచాయతీలకు సంబంధించి జిల్లాలో మూడో విడత ఎన్నికలు జరిగే పాడేరు, అరకులోయ, డుంబ్రిగుడ, హుకుంపేట మండలాల్లో నామినేషన్ల స్వీకరణ గడువు సోమవారంతో ముగియనుంది. కాగా రెండో రోజైన ఆదివారం 36 నామినేషన్ల కేంద్రాల్లోనూ సర్పంచులకు 312, వార్డులకు 692 నామినేషన్లను స్వీకరించారు.

ఆఖరి రోజు కావడంతో సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అలాగే మూడో విడత ఎన్నికలు డిసెంబరు 2న నిర్వహించి, అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు. ఇందులో భాగంగా మూడో విడతగా జిల్లాలోని పాడేరు మండలంలో 26 పంచాయతీలు- 246 వార్డులు, అరకులోయలో 14 పంచాయతీలు- 164 వార్డులు, డుంబ్రిగుడలో 18 పంచాయతీలు- 188 వార్డులు, హుకుంపేట మండలంలో 33 పంచాయతీలు- 282 వార్డులకు డిసెంబరు 2న ఎన్నికలు జరుగుతాయి. ఆ నాలుగు మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 36 కేంద్రాలను, ఎన్నికలకు 880 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా పాడేరు మండలంలో 44,536, అరకులోయలో 41,480, డుంబ్రిగుడలో 38,743, హుకుంపేటలో 45,787 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 11:54 PM