Share News

రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:40 AM

జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.

రెండో విడత నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
జోలాపుట్టులో నామినేషన్లు వేసేందుకు వచ్చిన అభ్యర్థులు

తొలి రోజు నాలుగు మండలాల్లో సర్పంచులకు 101, వార్డులకు 115 నామినేషన్లు

పెదబయలులో సర్పంచులకు అత్యధికంగా 34

20 వరకు స్వీకరణ

పాడేరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెదబయలు, ముంచంగిపుట్టు, అనంతగిరి, జి.మాడుగుల మండలాల్లో బుధవారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నాలుగు మండలాల్లోని 87 పంచాయతీలు, 880 వార్డులకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు 34 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో తొలి రోజు బుధవారం నాలుగు మండలాల్లో సర్పంచులకు 101, వార్డులకు 115 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలాల వారీగా చూస్తే... ముంచంగిపుట్టులో సర్పంచులకు 33, వార్డులకు 34 నామినేషన్లు, పెదబయలులో సర్పంచులకు 34, వార్డులకు 38 నామినేషన్లు, అనంతగిరిలో సర్పంచులకు 16, వార్డులకు 21 నామినేషన్లు, జి.మాడుగుల మండలంలో సర్పంచులకు 18, వార్డులకు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు అధికారులు నామినేషన్లను స్వీకరిస్తారని డీపీవో కేపీ చంద్రశేఖర్‌, డీఎల్‌పీవో పీఎస్‌ కుమార్‌ తెలిపారు. కాగా ముంచంగిపుట్టులో 38,895 మంది, పెదబయలులో 43,322, అనంతగిరిలో 38,286, జి.మాడుగులలో 44,674 మంది ఓటర్లు ఉన్నారు.

Updated Date - Nov 19 , 2026 | 12:40 AM