పెండింగ్ పనులు వేగవంతం
ABN , Publish Date - Sep 17 , 2026 | 11:42 PM
మండలంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ గురువారం సుడిగాలి పర్యటన చేశారు.
ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆదేశం
మండలంలో పీవో సుడిగాలి పర్యటన
పెదబయలు, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి):మండలంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్యవర్మ గురువారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పీఎం జన్‌మన్ పథకం పనులు, మినీ అంగన్‌వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీ, పాఠశాల భవనాలు, రహదారుల నిర్మాణాలను పరిశీలించారు. గిరిజన సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పనులను వేగంగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆదేశించారు. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీలోని పూలబంద, తాడిపుట్టు, బూసిపుట్టు గ్రామాలలో ప్రజలతో మాట్లాడారు. తాగునీరు, రహదారులు, గృహ నిర్మాణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పీవో హామీ ఇచ్చారు. ఆయన వెంట వివిధ శాఖల అధికారులు ఉన్నారు.