Share News

అభివృద్ధి పనులు వేగవంతం

ABN , Publish Date - Apr 21 , 2026 | 12:35 AM

జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం/వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.

అభివృద్ధి పనులు వేగవంతం
మాట్లాడుతున్న జేసీ టి.శ్రీపూజ, పక్కన ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

అధికారులకు జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశం

ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులు సత్వరమే పూర్తి చేయాలని సూచన

పాడేరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశం/వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పాఠశాల భవన నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు భవనాలు ఉన్నదీ?, లేనిదీ? పరిశీలించి, అవసరమైన వాటికి సొంత భవనాలు సమకూర్చాలన్నారు. ప్రస్తుతం పాఠశాలల నిర్మాణ పనులు చేపడుతున్నప్పుడు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా గడువు నాటికి పాఠశాలల భవన నిర్మాణాలను పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని, ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ మాట్లాడుతూ నిర్మాణ పనులకు సంబంధించిన ప్రగతిపై ప్రతి వారం తాము సమీక్ష నిర్వహిస్తామన్నారు. మంజూరైన భవన నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయాలని, ఆయా శాఖల మధ్య సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఏపీడీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పరిమిళ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈ డేవిడ్‌రాజు, డీఈఈలు, ఎంఈవోలు పాల్గొన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 12:35 AM