Share News

మహిళల రక్షణకు అభయ

ABN , Publish Date - Sep 26 , 2026 | 12:22 AM

రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అభయ కార్యక్రమం చేపట్టామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం నక్కపల్లిలో పలు ఆటోలు, ఆర్టీసీ బస్సులు, పాఠశాలలు, కళాశాలలు, మ్యాక్సీ క్యాబ్‌ తదితర ప్రజా రవాణా వాహనాల్లో అభయ క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను అతికించిన హోం మంత్రి మహిళలు, బాలికలతో మాట్లాడారు. ఆభయ క్యూఆర్‌ కోడ్‌ వినియోగంపై వారికి అవగాహన కల్పించారు.

మహిళల రక్షణకు అభయ
ఆటోలో అభయ క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్‌ను అతికిస్తున్న హోం మంత్రి అనిత

- హోం మంత్రి అనిత

నక్కపల్లి, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అభయ కార్యక్రమం చేపట్టామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం నక్కపల్లిలో పలు ఆటోలు, ఆర్టీసీ బస్సులు, పాఠశాలలు, కళాశాలలు, మ్యాక్సీ క్యాబ్‌ తదితర ప్రజా రవాణా వాహనాల్లో అభయ క్యూఆర్‌ కోడ్‌ స్టిక్కర్లను అతికించిన హోం మంత్రి మహిళలు, బాలికలతో మాట్లాడారు. ఆభయ క్యూఆర్‌ కోడ్‌ వినియోగంపై వారికి అవగాహన కల్పించారు. అభయ క్యూఆర్‌ కోడ్‌ను మహిళలు తమ స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా స్కాన్‌చేసిన వెంటనే సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతుందన్నారు. అందులో తమ పేరు, వివరాలు, సమస్యను నమోదుచేసి సబ్మిట్‌ చేస్తే ఆ సమాచారం వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కి చేరుతుందన్నారు. అక్కడి సిబ్బంది బాధిత మహిళకు ఫోన్‌చేసి వివరాలు తెలుసుకుని ఆమెకు తక్షణ సహాయం అందించేందుకు సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌ సిబ్బందిని పంపిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ కొప్పిశెట్టి వెంకటేశ్‌తో పాటు పలువురు పోలీసులు అధికారులు. సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 12:22 AM