వనజాజుల వాగుపై కర్రల వంతెన
ABN , Publish Date - Sep 14 , 2026 | 12:04 AM
మండలంలోని తాజంగి పంచాయతీ వనజాజుల వాగుపై గిరిజనులు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు.
శ్రమదానంతో నిర్మించుకున్న గిరిజనులు
పది గ్రామాల ప్రజల రవాణ కష్టాలకు
తాత్కాలిక ఉపశమనం
చింతపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి):
మండలంలోని తాజంగి పంచాయతీ వనజాజుల వాగుపై గిరిజనులు కర్రలతో వంతెన నిర్మించుకున్నారు. దీంతో పది గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న రవాణ కష్టాలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తాజంగి పంచాయతీ పరిధిలోని పది గ్రామాల ప్రజలు చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం వెళ్లేందుకు వనజాజుల వాగు దాటుకు వెళ్లాలి. వాగు ఉధృతంగా ప్రవహిస్తే 19 కిలోమీటర్లు అధికంగా ప్రయాణించి వెళ్లాల్సి వస్తున్నది. స్థానిక గిరిజనులు వైసీపీ ప్రభుత్వ హయాంలో వంతెన నిర్మించాలని పలుమార్లు అర్జీలు ఇచ్చినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. గిరిజనులు వాగు దాటేందుకు ఇబ్బందులను తొలగించుకునేందుకు పది గ్రామాల గిరిజనులు శ్రమదానంతో కర్రల వంతెన నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఈ వంతెనపైన ద్విచక్రవాహనాలు సైతం ప్రయాణిస్తున్నాయి. అయితే వనజాజుల వంతెన వద్ధ శాశ్వత వంతెన నిర్మించాలని స్థానిక గిరిజనులు, టీడీపీ మండల కార్యనిర్వాహక కార్యదర్శి ఆండ్రాబు లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు.