Share News

పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Mar 14 , 2026 | 11:42 PM

జిల్లా పర్యటనకు శనివారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌కు పాడేరులో ఘన స్వాగతం లభించింది.

పవన్‌కల్యాణ్‌కు ఘన స్వాగతం
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు హెలిప్యాడ్‌ వద్ద స్వాగతం పలుకుతున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

పాడేరు, మార్చి 14(ఆంధ్రజ్యోతి): జిల్లా పర్యటనకు శనివారం విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌కు పాడేరులో ఘన స్వాగతం లభించింది. హెలికాఫ్టర్‌ దిగగానే జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌.దినేశ్‌కుమార్‌ గులాబీని అందించి స్వాగతం పలికారు. జీసీసీ చైర్మన్‌ కిడారి శ్రావణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, జనసేన అరకులోయ ఇన్‌చార్జి గంగులయ్య, తదితరులు పుష్ఫగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. హెలిప్యాడ్‌ నుంచి ప్రత్యేక వాహనంలో ఓనూరు జంక్షన్‌కు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన నందిగరువు చేరుకున్న ఆయన ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ఎం.వెంకటేశ్వరరావు పుష్ఫగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. స్థానిక గిరిజన మహిళలు సైతం సంప్రదాయంగా ఆయనకు బొట్టుపెట్టి స్వాగతం పలికారు.

Updated Date - Mar 14 , 2026 | 11:42 PM