జాతిపితకు ఘన నివాళి
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:34 PM
జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
పాడేరు, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): జాతిపిత మహాత్మగాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టరేట్ టి.నిషాంతి. జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, సబ్‌కలెక్టర్ కె.చిరంజీవినాగ సాహిత్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, పలువురు అధికారులు గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా జాతిపిత దేశానికి అందించిన సేవలు, త్యాగాలను జిల్లా కలెక్టర్ నిషాంతి వివరించారు. మహాత్మాగాంధీ చూపిన బాటలో అందరం నడవడమే ఆయనకు ఘన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమి చైర్మన్ వంపూరు గంగులయ్య, టైకార్ డైరెక్టర్ కె.కృష్ణారావు, జిల్లా పంచాయతీ అధికారి కేపీ.చంద్రశేఖర్, డీఎల్‌పీవో పీఎస్.కుమార్, డీఆర్‌డీఏ పీడీ జి.జయకృష్ణ, డీఎంహెచ్‌వో రియాజ్‌భేగ్, తదితులు పాల్గొన్నారు.