మూడు కిలోమీటర్లు డోలీమోత
ABN , Publish Date - Nov 04 , 2026 | 11:19 PM
మండలంలోని బూదరాళ్ల పంచాయతీ బి.శింగవరం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.
వర్షంలో గర్భిణికి తప్పని అవస్థలు
కొయ్యూరు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బూదరాళ్ల పంచాయతీ బి.శింగవరం గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ గ్రామానికి చెందిన గెమ్మెలి శివయ్య భార్య కుమారి నిండు గర్భిణి. ఆమెకు బుధవారం ఉదయం పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో గ్రామస్థులు డోలీ కట్టి మూడు కిలోమీటర్ల మేర ఆమెను వర్షంలో బూదరాళ్ల వరకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అంబులెన్సులో రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సమయానికి గ్రామస్థులు స్పందించి సకాలంలో పీహెచ్‌సీకు తరలించడంతో కుమారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో డోలీమోతలు తప్పడం లేదని, అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.