పక్కాగా వంద రోజుల యాక్షన్ ప్లాన్
ABN , Publish Date - Jan 25 , 2026 | 12:53 AM
పదవ తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు స్పష్టం చేశారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు.
- టెన్త్‌లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
- ఉపాధ్యాయులకు డీఈవో అప్పారావునాయుడు ఆదేశం
అనకాపల్లి టౌన్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): పదవ తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పక్కాగా అమలు చేయాలని అనకాపల్లి జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు స్పష్టం చేశారు. స్థానిక మెయిన్‌రోడ్డులోని జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాలలో జరుగుతున్న క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో పదవ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. ఈ క్లస్టర్ సమావేశంలో అజెండా ప్రకారం నేర్చుకున్న అంశాలను స్కూల్‌లో టీచర్లు పక్కాగా అమలు చేయాలన్నారు. ప్రైమరీ స్కూల్‌కు సంబంధించి జీఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్ అన్ని పాఠశాలల్లో పక్కాగా అమలు చేయాలని, పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలన్నారు. పాఠశాలల్లో ఉన్న విద్యార్థులు మధ్యలో డ్రాప్ అవుట్ కాకుండా చూడాలన్నారు. కాంప్లెక్స్ మీటింగ్‌లను సద్వినియోగం చేసుకొని విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మాజీ, సీసీ వెంకటేశ్వరరావు, ఆర్‌సీలు గోవిందరావు, సీఆర్‌పీ నీలవేణి, తదితరులు పాల్గొన్నారు.