ఘనంగా మట్టల ఆదివారం
ABN , Publish Date - Mar 29 , 2026 | 11:30 PM
జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం క్రైస్తవులు మట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చిల్లో ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరూ పట్టణ వీధుల్లో మట్టలతో ప్రదర్శన నిర్వహించారు.
పాడేరు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం క్రైస్తవులు మట్టల ఆదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక చర్చిల్లో ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, అందరూ పట్టణ వీధుల్లో మట్టలతో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, భక్తులు పాల్గొన్నారు.
చింతపల్లిలో..
చింతపల్లి: మండలంలో క్రైస్తవులు ఘనంగా మట్టల ఆదివారాన్ని జరుపుకున్నారు. క్రైస్తవులు ప్రతి ఏటా గుడ్‌ఫ్రైడేకు ముందు మట్టల ఆదివారం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం క్రైస్తవులు చర్చిలకు మట్టలతో వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చింతపల్లి ఆదివాసీ ప్రభావిత పథం చర్చిలో పాస్టర్ వి.సోమరాజు, డేగలపాలెం, మాడెం యేసు క్రీస్తు ప్రార్థన మందిరంలో పాస్టర్ ఎం.జాన్ పీటర్ వాక్యోపదేశం చేశారు. చిన్నారులు మట్టలను ప్రదర్శిస్తూ ప్రత్యేక గీతాలను ఆలపించారు. సెయింట్ ఆన్స్ పాఠశాలలో క్రైస్తవులు మట్టలతో ర్యాలీ చేశారు.