మినుములూరు సర్పంచ్ చిట్టెమ్మకు అరుదైన అవకాశం
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:35 PM
పాడేరు మండలం మినుములూరు సర్పంచ్ లంకెల చిట్టెమ్మకు అరుదైన అవకాశ ం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించింది.
8, 9 తేదీల్లో పుణెలో జరిగే జాతీయ సదస్సుకు ఆహ్వానం
పాడేరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): పాడేరు మండలం మినుములూరు సర్పంచ్ లంకెల చిట్టెమ్మకు అరుదైన అవకాశ ం లభించింది. మహారాష్ట్రలోని పుణెలో ఈ నెల 8, 9 తేదీల్లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం లభించింది. రాష్ట్రంలోని మొత్తం 28 జిల్లాల పరిధిలో ఆరుగురు సర్పంచులు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులు, ముగ్గురు ఈవో పీఆర్‌డీలు, ఇద్దరు ఎంపీడీవోలను మాత్రమే ఆహ్వానించారు. ఉత్తరాంధ్రలోని మొత్తం తొమ్మిది జిల్లాల పరిధిలో కేవలం మినుములూరు పంచాయతీ సర్పంచ్ చిట్టెమ్మ ఒకరికి మాత్రమే ఆ సదస్సులో పాల్గొనేందుకు అవకాశఽం దక్కడం విశేషం.