కొత్త జలపాతం కనువిందు
ABN , Publish Date - Oct 06 , 2026 | 12:15 AM
ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మరో జలపాతం బయట పడింది. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల పైనుంచి పాలధారలా ఉరకేస్తున్న జలపాతం గురించి తెలిసి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు.
గాలికొండ సమీపంలో బహిర్గతం
సీలేరు, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రా- ఒడిశా సరిహద్దులో మరో జలపాతం బయట పడింది. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల పైనుంచి పాలధారలా ఉరకేస్తున్న జలపాతం గురించి తెలిసి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. జీకేవీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ గాలికొండలో ఈ జలపాతం బయటపడింది. ఐస్‌గెడ్డకు సమీపంలో ఈ జలపాతం ఉంది. ఇటీవల కొందరు పర్యాటకులు ఇక్కడికి వచ్చి ఈ జలపాతాన్ని చూసి వెళ్లారు. వారి ద్వారా ప్రచారం జరిగి రోజూ పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈ ప్రాంతాన్ని అధికారులు అభివృద్ధి చేస్తే పర్యాటక శాఖకు ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.