Share News

కోమటి చెరువుకు కొత్తరూపు

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:54 AM

ఆక్రమణలకు గురై మురికి కూపంగా ఉన్న పట్టణ శివారు అన్నవరం వెంకయ్యగారిపేటలో ఉన్న ఏడెకరాల కోమటి చెరువు యువకుల సంకల్పంతో ఇప్పుడు కొత్తరూపు సంతరించుకుంది. గ్రామస్థుల సహకారంతో యువకులు చందాలు వేసుకుని శ్రమదానంతో చెరువును అభివృద్ధి చేశారు.

కోమటి చెరువుకు కొత్తరూపు
అన్నవరం వెంకయ్యగారిపేటలో గ్రామస్థులు అభివృద్ధి చేసిన తరువాత కోమటిచెరువు

- యువకుల సంకల్పానికి గ్రామస్థుల చేయూత

- కలిసికట్టుగా అభివృద్ధి

చోడవరం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): ఆక్రమణలకు గురై మురికి కూపంగా ఉన్న పట్టణ శివారు అన్నవరం వెంకయ్యగారిపేటలో ఉన్న ఏడెకరాల కోమటి చెరువు యువకుల సంకల్పంతో ఇప్పుడు కొత్తరూపు సంతరించుకుంది. గ్రామస్థుల సహకారంతో యువకులు చందాలు వేసుకుని శ్రమదానంతో చెరువును అభివృద్ధి చేశారు.

తొలుత చెరువు గట్టు వెంబడి ఆక్రమణలను తొలంగించారు. చెరువులో మురుగునీటిని తోడి పూడిక తీశారు. చెరువు గట్లను ఎత్తు చేశారు. చెరువు గట్టునే ఉన్న ముత్యమాంబ ఆలయం చుట్టూ చదును చేశారు. ఈ చెరువు భవిష్యత్తులో ఆక్రమణలకు గురికాకుండా, ఫెన్సింగ్‌ వేయడంతో పాటు గట్టుపై మొక్కలు పెంపకం కూడా చేపట్టేందుకు శ్రీకారం చుట్టారు. వాకింగ్‌ ట్రాక్‌, పిల్లలు ఆడుకునేందుకు వీలుగా చెరువును అభివృద్ధి చేసేందుకు నడుంబిగించారు. అలాగే రెండు వందల ఏళ్లనాటి రావిచెట్టును సంరక్షించేందుకు చర్యలు తీసుకున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:54 AM