Share News

త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం

ABN , Publish Date - Nov 30 , 2026 | 01:36 AM

చింతాలమ్మఘాట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయి అదుపుతప్పిన సమయంలో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడం తో ప్రాణ నష్టం జరగలేదు. నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం మండలంలోని రేవళ్లు నుంచి 37 మంది ప్రయాణికులతో నర్సీపట్నం బయలుదేరింది.

      త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
చింతాలమ్మఘాట్‌లో కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

- చింతాలమ్మఘాట్‌లో బ్రేకులు ఫెయిల్‌ అయి కొండను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

- డ్రైవర్‌, కండక్టర్‌తో పాటు 16 మందికి గాయాలు

- ప్రయాణికుల ప్రాణాలు నిలిపిన డ్రైవర్‌ సమయస్ఫూర్తి

కొయ్యూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): చింతాలమ్మఘాట్‌లో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ అయి అదుపుతప్పిన సమయంలో డ్రైవర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించడం తో ప్రాణ నష్టం జరగలేదు. నర్సీపట్నం డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం మండలంలోని రేవళ్లు నుంచి 37 మంది ప్రయాణికులతో నర్సీపట్నం బయలుదేరింది. ఉదయం 11.40 గంటల సమయంలో చింతాలమ్మఘాట్‌ వద్దకు వచ్చే సరికి బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దీనిని గుర్తించిన డ్రైవర్‌ ఇత్తంశెట్టి సత్తిబాబు ప్రయాణికులను అప్రమత్తం చేసి చాకచక్యంగా బస్సును కంట్రోల్‌ చేస్తూ మూడు మలుపులు దాటించారు. అయితే మరో మలుపు వద్దకు వచ్చే సరికి బస్సు వేగం పెరగడమే కాకుండా గేర్‌ మార్చేందుకు అవకాశం లేకపోవడంతో నిలువరించేందుకు కొండను ఢీకొట్టాడు. దీంతో డ్రైవర్‌కు రెండు కాళ్లు విరిగిపోవడంతో పాటు పలు చోట్ల గాయాలయ్యాయి. కండక్టర్‌ ఇత్తంశెట్టి శ్రీనివాసరావు తలకు బలమైన గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న చింతవానిపాలేనికి చెందిన మామిడి లక్ష్మణరావు, ఉమామహేశ్వరి, కృష్ణాదేవిపేటకు చెందిన ముంజేటి మరియ్యమ్మ, నిమ్మలపాలేనికి చెందిన బచ్చలసాయి, ఏటిగైరంపేటకు చెందిన పైల సత్యవతి, కునుకూరుకు చెందిన కె.రాములమ్మ, చీడిపల్లికి చెందిన కిముడు రాములమ్మ, రేవళ్లుకు చెందిన లోతారాజు, జనుమూరి లోవకుమారి, వేణుకుమార్‌, రాజేంద్ర, గాం మరిణయ్య, కసిరెడ్డి కోటేశ్వరరావు, గుడ్డపల్లికి చెందిన నవరంగి సత్యనారాయణ, రేవళ్లు కంఠారానికి చెందిన కవిలి పద్మ, మామిడి ఉమామహేశ్వరికి గాయాలయ్యాయి. విషయం తెలిసి కొయ్యూరు సీఐ శ్రీనివాసరావు వెంటనే మంప ఎస్‌ఐ ఎస్‌.శ్రీనివాసరావుకు సమాచారం ఇచ్చారు. అలాగే చింతపల్లి ఏఎస్‌పీకి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మకు సమాచారం అందజేశారు. దీంతో సంఘటనా స్థలానికి నాలుగు అంబులెన్సులను వైద్య సిబ్బందిని పంపించారు. తీవ్రంగా గాయపడిన కసిరెడ్డి కోటేశ్వరావు, సాయిఉమామహేశ్వరావులను నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి, మిగతా వారిని కృష్టాదేవిపేట పీహెచ్‌సీకి తరలించారు. తహశీల్దార్‌ ప్రసాద్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Nov 30 , 2026 | 01:36 AM