Share News

వంట గ్యాస్‌పై బాదుడు

ABN , Publish Date - Jun 08 , 2026 | 12:50 AM

గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మరోసారి పెంచింది. మూడు నెలల క్రితం రూ.60 పెంచగా.. తాజాగా రూ.29 పెరిగింది. దీంతో జిల్లాలో వంట గ్యాస్‌ వినియోగదారులపై నెలకు సుమారు రూ.60 లక్షల మేర అదనపు భారం పడనున్నది.

వంట గ్యాస్‌పై బాదుడు

గృహ వినియోగ సిలిండర్‌కు రూ.29 పెంపు

మూడు నెలల్లో రూ.89 పెరుగుదల

జిల్లా వినియోగదారులపై నెలకు రూ.60.9 లక్షలు అదనపు భారం

-----

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో గృహ వినియోగ వంట గ్యాస్‌ ధరలు

పట్టణం పాత ధర కొత్త ధర

అనకాపల్లి రూ.922 రూ.951

నర్సీపట్నం రూ.930 రూ.959

ఎలమంచిలి రూ.922 రూ.951

చోడవరం రూ.920 రూ.949

పాయకరావుపేట రూ.932.5 రూ.961.5

----

అనకాపల్లి, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ గ్యాస్‌ సిలిండర్‌ ధరను కేంద్రం మరోసారి పెంచింది. మూడు నెలల క్రితం రూ.60 పెంచగా.. తాజాగా రూ.29 పెరిగింది. దీంతో జిల్లాలో వంట గ్యాస్‌ వినియోగదారులపై నెలకు సుమారు రూ.60 లక్షల మేర అదనపు భారం పడనున్నది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇప్పటికే పెట్రోలు, డిజిల్‌, అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. తాజాగా పెరిగిన వంట గ్యాస్‌ ధరతో మరింత భారం పడకతప్పదు. దినసరి కూలీలు, నెల వారీ జీతాలతో కుటుంబాలను పోషించేకునే ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులకు ఇబ్బందులు మరింత పెరుగుతాయి.

జిల్లాలో మూడు ప్రభుత్వ రంగ సంస్థల చెందిన 24 గ్యాస్‌ ఏజెన్సీలు వున్నాయి. మొత్తం 4,08,320 మంది వినియోగదారులు వున్నారు. రోజూ సగటున ఏడు వేల సిలిండర్లు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్‌పై రూ.20 చొప్పున ధర పెరగడంతో రోజుకు రూ.2.03 లక్షల చొప్పున నెలకు రూ.60.9 లక్షల మేర అదనపు భారం పడనున్నది.

Updated Date - Jun 08 , 2026 | 12:50 AM