Share News

గిరిజనుల ఆనంద హేల

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:26 PM

మండలంలోని పెదకోట పంచాయతీ మడ్రేబ్‌ గ్రామ గిరిజనుల రేషన్‌ కష్టాలు తీరాయి. అధికారులు గురువారం ఈ గ్రామంలో రేషన్‌ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

గిరిజనుల ఆనంద హేల
ధింసా నృత్యంతో ఆనందం వ్యక్తం చేస్తున్న గిరిజనులు

మడ్రేబ్‌లో రేషన్‌ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు

కష్టాలు తీరాయని ధింసా నృత్యంతో ఆనందం వ్యక్తం చేసిన ఆదివాసీలు

అనంతగిరి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదకోట పంచాయతీ మడ్రేబ్‌ గ్రామ గిరిజనుల రేషన్‌ కష్టాలు తీరాయి. అధికారులు గురువారం ఈ గ్రామంలో రేషన్‌ స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మడ్రేబ్‌ గ్రామంలో 29 మంది రేషన్‌కార్డుదారులు ఉన్నారు. రేషన్‌ కోసం ప్రతి నెల 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న వేలమామిడి ఎస్‌హెచ్‌జీ డిపో వద్దకు కాలినడకన, గుర్రాలపై వెళుతుండేవారు. వీరి కష్టాలపై ‘ఆంధ్రజ్యోతి’తో పాటు పలు పత్రికల్లో కథనాలు రావడంతో అధికారులు స్పందించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వేలమామిడి ఎస్‌హెచ్‌జీ డిపో డీలర్‌ అప్పారావు మడ్రేబ్‌ గ్రామంలో గురువారం స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి కార్డుదారులకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. దీంతో మడ్రేబ్‌ పీవీటీజీ గిరిజనులు ధింసా నృత్యంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేసి కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Aug 06 , 2026 | 11:26 PM