ఘనంగా పసుపు పండుగ
ABN , Publish Date - May 28 , 2026 | 12:01 AM
తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ప్రతి మండల కేంద్రంలోనూ పసుపు పండుగను ఘనంగా జరుపుకున్నారు.
పాడేరు, అరకులోయ, చింతపల్లితో సహా ప్రతి మండల కేంద్రంలో మహానాడు సందడి
అమరావతిలోని టీడీపీ మహానాడును ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన పార్టీ శ్రేణులు
పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడును జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ నేతలు బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరు మొదలుకుని ప్రతి మండల కేంద్రంలోనూ పసుపు పండుగను ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్‌కు సమీపంలోని ఎన్‌ఆర్.శంకరన్ హాలులో టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమ పరిశీలకురాలిగా కొణతాల రత్నకుమారి హాజరుకాగా, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలుపర్తి గోవిందరావు, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టూరిజం డైరెక్టర్ కిల్లు రమేశ్‌నాయుడు, పీఏసీఎస్ పర్సన్ ఇన్‌చార్జ్ డప్పోడి వెంకటరమణ, వైస్‌ఎంపీపీ గంగపూజారి శివకుమార్, ఐటీడీపీ ఇన్‌చార్జి బుద్ధ జ్యోతికిరణ్, నియోజకవర్గంలోని ముఖ్య నేతలు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. అలాగే పర్యాటక కేంద్రం అరకులోయలో ఆర్‌టీసీ విజయనగరం జోన్ చైర్మన్ దొన్నుదొర ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. హుకుంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అరకులోయ నియోజకవర్గ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావు పాల్గొన్నారు. చింతపల్లి కేంద్రంలో టీడీపీ పార్లమెంట్ ఉపాధ్యక్షురాలు చల్లంగి జ్ఞానేశ్వరి, సీనియర్ నేతలు చల్లంగి లక్ష్మణరావు, కిల్లో పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోనూ మండల స్థాయి నేతలు, కార్యకర్తలు పసుపు పండుగను జరుపుకున్నారు. అలాగే అన్ని ప్రాంతాల్లోనూ అమరావతిలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.