ప్రతిభావంతులకు ఘన సత్కారం
ABN , Publish Date - May 01 , 2026 | 11:11 PM
జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన 20 మంది విద్యార్థులకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఘనంగా సత్కరించారు.
టెన్త్‌లో 20 మంది టాపర్లను సత్కరించిన కలెక్టర్, జేసీ, ఐటీడీఏ పీవో
పాడేరు, మే 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన 20 మంది విద్యార్థులకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ టి.నిషాంతి, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఘనంగా సత్కరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన టాప్ ఫైవ్ విద్యార్థులు పరుంబుడి దేవి(593), దనంశెట్టి తనూజా(532), పెరుశెట్టి ఊర్మిళ(515), కొర్రా కీర్తన (505), సిరగం ధనలక్ష్మి (499), గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు చెందిన టాప్ ఫైవ్ విద్యార్థులు ఉబ్బేటి దీపక్ (583), కొర్రా తేజశ్రీ (579), తాంగుల సాయిజ్యోతి (571), అంపూరు అమృతవర్షిణి (566), జర్సింగి ఏలియా (559), కేజీబీవీల్లో టాప్ ఫైవ్ బాలికలు బొండా మాళవిక (520), కిల్లో సమీరా (495), పాంగి వేణిప్రియా (494), పాంగి రోహిణి (489), వంతాల అశ్విని (487), గిరిజన సంక్షేమ గురుకులాల టాప్ ఫైవ్ విద్యార్థులు జర్రా నరసింగరావు (553), పాంగి మేరీ ఝాన్సీ (536), కొర్రా మేఘనమాధురీ (531), జన్ని జాషువా విన్సన్(530), రాకోటి పార్థసారధి (520) లకు బహుమతులను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీఎస్.లోకేశ్వరరావు, జిల్లా విద్యాశాఖాధికారి రామకృష్ణారావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే పరిమిళ, గిరిజన సంక్షేమ గురుకులాల కన్వీనర్ పీఎస్.మూర్తి, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.