ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
ABN , Publish Date - Jan 18 , 2026 | 10:44 PM
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
వాడవాడలా వర్ధంతి వేడుకలు
పాడేరు, జనవరి 18 (ఆంధ్ర జ్యోతి): తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కేంద్రం పాడేరులోని ఎన్‌టీఆర్ విగ్రహానికి జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక జిల్లా ఆస్పత్రిలో రోగులకు పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. అరకులోయలో ఆర్‌టీసీ విజయనగరం రీజియన్ చైర్మన్ దొన్నుదొర, చింతపల్లిలో టీడీపీ సీనియర్ నేతలు చల్లంగి లక్ష్మణరావు, జ్ఞానేశ్వరి తదితరులు ఎన్‌టీఆర్ విగ్రహానికి మాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గ, మండల, పంచాయతీ, గ్రామ స్థాయిల్లోనూ టీడీపీ శ్రేణులు ఎన్‌టీఆర్ అభిమానులు ఆయన వర్ధంతిని నిర్వహించారు.