అల్లూరికి ఘన నివాళి
ABN , Publish Date - May 08 , 2026 | 12:27 AM
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాలను గురువారం మండలంలోని మంప, రాజేంద్రపాలెంలో గల అల్లూరి స్మారక ప్రదేశాల వద్ద ఘనంగా నిర్వహించారు.
మంప, రాజేంద్రపాలెంలోని స్మారక ప్రదేశాల వద్ద మన్యం వీరుడి వర్ధంతి కార్యక్రమాలు
నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
కొయ్యూరు, మే 7 (ఆంధ్రజ్యోతి): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమాలను గురువారం మండలంలోని మంప, రాజేంద్రపాలెంలో గల అల్లూరి స్మారక ప్రదేశాల వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ హాజరై అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్రపాలెం అల్లూరి స్మారక మందిరాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మంప, రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు సురేంద్ర, స్వప్నకుమారి, గాదె శ్రీనివాసరావు, పాడేరు మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ మంగతల్లి, బీజేపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు పరశురామరాజు, పరమేశ్వరావు, ట్రైకార్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు, పీఏసీఎస్ డైరెక్టర్ చంద్రరావు, బీజేపీ మండల అధ్యక్షుడు సంపరి శివకుమార్, పార్టీ నేతలు పద్మరాజు, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.